భూ వివాదల కారణంగా అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. స్థలాలకు రేట్లు పెరగడంతో భూ వివాదలు బాగా పెరిగాయని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘర్షణల కారణం ఎంతో మంది హత్యకు గురయ్యారు. తాజాగా ప్రకాశం జిల్లాలో అదే తరహా ఘర్షణ జరిగింది.
సమాజంలో నిత్యం అనేక రకాలైన ఘర్షణలు జరుగుతుంటాయి. ముఖ్యం భూములు, ఇంటి స్థలాలు, ఇతర ఆస్తులకు సంబంధించిన విషయాల్లో ఎక్కువగా గొడవలు జరుగుతుంటాయి. ఈ భూ వివాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కొల్పోతున్నారు. స్థలాల కోసం హత్య చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఈ మధ్యకాలంలో భూ వివాదలకు బాగా పెరిగిపోయాయి. స్థలాలకు రేట్లు పెరగడమే ఈ వివాదలకు కారణమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇక తాజాగా ఓ స్థలం విషయంలో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఇదే సమయంలో ఓ వ్యక్తి ఆవేశంతో ప్రత్యర్ధి చెవిని కొరికి పడేశాడు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లె గ్రామంలో మాచపల్లె నాగరాజు కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడి తండ్రి 25 ఏళ్ల క్రితం గ్రామాల్లో స్థలం కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ఇటీవలే ఇంటిని నిర్మించేందుకు ఆ స్థలాన్ని బాగు చేయిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మురళి ఆ స్థలం గ్రామ కంఠానికి చెందినదని స్పందన కార్యక్రమంలో అధికారులకు తెలిపాడు. అంతేకాక ఆ స్థలం విషయంపై అధికారులకు అర్జీ కూడా అందజేశాడు. ఇదే విషయమై గత కొంతకాలం నుంచి ఈ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.
ఇదే విషయంలో సోమవారం రాత్రి నాగరాజు, అతని బంధువులతో మురళి ఘర్షణకు దిగినట్లు సమాచారం. అంతేకాక నాగరాజు, అతడి కుటుంబ సభ్యులను మురళి దుర్భాషలాడాడు. దీంతో నాగరాజు, అతని బంధువులు పెద్ద బాలగురవయ్య, చిన్న బాలగురవయ్య, అతడి భార్య లక్ష్మి.. మురళిపై దాడి చేశాడు. అంతేకాక ఇరు వర్గాల మధ్యల కాసేపు తీవ్రంగా ఘర్షణ చెలరేగింది. ఇదే సమయంలో కోప్రోద్రికుడైన నాగరాజు.. మురళి చెవిను కొరికేయడంతో అది కాస్తా తెగి కింద పడింది. దీంతో బాధితుడిని వెంటనే మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స అందించిన వైద్యులు.. తెగిపోయిన చెవిని ఆపరేషన్ చేసి అతికించారు.
ఆ చెవి భాగం సరైన సమయంలో ఆస్పత్రికి తీసుకు రావడంతో అందులోని కణాలు సజీవంగా ఉన్నాయని, దీంతో అతడికి తిరిగి చెవును అతికించామని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్సై కోటయ్స దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కొన్ని నెలల క్రితం ఇదే ప్రాంతంలో భూ వివాదల కారణంగా ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా బండరాయి కొట్టి చంపేశారు. అప్పట్లో ఆ సంఘటన సంచలనంగా మారింది. తమకు న్యాయం చేయాలంటూ మృతుడి భార్య.. పోలీస్ స్టేషన్ ముందు దీక్ష చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అదే ప్రాంతంలో మరోసారి అదే తరహా ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మరి.. ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.