ఈ మధ్యకాలంలో మహిళలు,యువతులపై అకృత్యాలు, దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహిళలపై జరిగే దాడుల్లో కొన్ని ప్రేమ, పెళ్లి గురించి జరుగుతుంటే..మరికొన్ని మాత్రం కామవాంఛాల కోసం జరుగుతున్నాయి. ఇటీవలే కొన్ని రోజుల క్రితం ఓ స్కూల్లో కొంతమంది బాలురు తమతో పాటు చదివే బాలికపై లైంగిక దాడి చేశారు. ఆ ఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువే బాలికతో తప్పుగా ప్రవర్తించి.. లైంగిక దాడి చేశాడు. ఇలా నిత్యం ఎదో ఓ ప్రాంతంలో మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆడవారి రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా.. అకృత్యాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఓ ప్రేమోన్మాది దాడిలో యువతిని కాపాడబోయి.. ఆమె తల్లి మరణించింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
బాపట్ల జిల్లాకు రేపల్లె చెందిన చెందిన సందీప్ కు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఈక్రమంలోనే యువతి సోదరుడికి జాబ్ రావడంతో తల్లి శోభతో సహా హైదరాబాద్ కు వచ్చారు. నగరంలోని మియాపూర్ ప్రాంతంలోని ఆదిత్యనగర్ లో నివాసం ఉంటున్నారు. అయితే ఇదే సమయంలో సందీప్.. ఆ యువతికి తరచూ ఫోన్లు చేసి.. ప్రేమిస్తున్నానంటూ వేధించేవాడు. ఇలానే కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలోనే మంగళవారం సందీప్ మియాపూర్‌లోని యువతి ఇంటికి వెళ్లాడు. అక్కడ తన ప్రేమ ప్రస్తావన తీసుకొచ్చి..మరోసారి ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. అనంతరం వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను పొడిచాడు.
ఈ దృశ్యాన్ని చూసిన యువతి తల్లి ఒక్కసారిగా షాక్ గురైంది. వెంటనే అతడి నుంచి తన కుమార్తెను కాపాడే ప్రయత్నం చేసింది. దీంతో సందీప్.. యువతి తల్లి శోభపై కూడా దాడి చేసి.. ఆమె పొట్ట భాగంలో తీవ్రంగా గాయపరిచాడు. తీవ్రంగా గాయపడ్డ తల్లీ కూతుళ్లు ఘటన స్థలంలోనే పడిపోయారు. అనంతరం సందీప్ అక్కడి నుంచి పరారయ్యాడు. యువతి, ఆమె తల్లి అరుపులు విన్న పక్కింటి వాళ్లు అక్కడికి చేరుకున్నారు. గాయాలపాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ యువతి తల్లి శోభ గురువారం మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరి, ప్రేమ పేరుతో యువతిపై, ఆమె తల్లిపై దాడికి పాల్పడ్డ సందీప్ ఉదంతం పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.