సంగారెడ్డి జిల్లా కందీలోని ఐఐటీ హైదరాబాద్ చెందిన మరో విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. మేఘ కపూర్ అనే ఐఐటీ విద్యార్ధి సంగారెడ్డిలోని ఓ లాడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేఘ కపూర్ మూడు నెలల క్రితమే ఐఐటీ హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేశాడు. మృతుడు రాజస్థాన్ లోని జోధ్ పూర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈనెల 31 న ఇదే ఐఐటీ హైదరాబాద్ చెందిన రాహుల్ అనే విద్యార్ధి అనుమానస్పందగా మృతి చెందాడు.రాహుల్ క్యాంపస్‌లోనే ఈ బ్లాక్ 107 రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన సంగతి తెలిసిందే. రాహుల్ మృతిపై అతని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అతడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా. రాహుల్ మరణంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో వారం రోజుల వ్యవధిలోనే మరో విద్యార్ధి ఆత్మహత్య చేసుకోవడంతో ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లో అసలు ఏం జరుగుతుందనే చర్చ జరుగుతోంది. మరి.. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.