అనుమానం అనేది అన్నికంటే పెద్ద భూతం. నేటికాలంలో ఈ భూతం ఎన్నో దారుణాలకు ప్రేరేపిస్తుంది. ఈ అనుమానం అనేది మనిషిలో మృగం తయారు అయ్యేలే చేస్తుంది. దీని కారణంగా అప్పటి వరకు ఎంతో ప్రేమకు,కంటికి రెప్పలా చూసుకున్న తండ్రి తన పిల్లలపై కర్కశత్వం ప్రదర్శిస్తుంటారు. ఈ భూతం కారణంగా ఎన్నో కుటుంబాలు నిట్టనిలువునా చీలిపోయాయి. తాజాగా అనుమానం దెబ్బకి ఓ కుటుంబమే బలైంది. కుటుంబ కలహాం ఆ ఇంట్లో కల్లోలం రేపింది. ఓ వ్యక్తి.. భార్య బిడ్డలను కత్తెరతో దారుణంగా పొడిచి చంపి.. ఆపై తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సంగారెడ్డి జిల్లా కోహిర్ కు చెందిన మడపతి నాగరాజు(42),సుజాత(36) దంపతులు హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి పాపిరెడ్డి నగర్ లో రాజీవ్ గృహకల్పలో ఎనిమిదేళ్లుగా నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె రమ్యశ్రీ(11) ఐదో తరగతి, కుమారుడు సిద్దార్ధ(7) రెండో తరగతి చదువుతున్నాడు. నాగరాజు కిరాణా దుకాణాల్లో సరకులు సరఫరా చేస్తుంటాడు. సుజాత కుట్టు మిషన్ పనిచేస్తోంది. అంతే కాక మరొకవైపు చిన్న మొత్తాలకు వడ్డీలను ఇస్తుంటుంది. ఇలా హాయిగా సాగుతున్న వీరికి కాపురంలో గత కొంతకాలం నుంచి కలహాలు మొదలయ్యాయి. నాగరాజు పనికి వెళ్లకుండా నెలరోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి తలుపులు వేసుకున్న నాగరాజు కుటుంబం లోపలి నుంచి బయటకు రాలేదు.
సోమవారం ఉదయం నాగరాజు ఇంటి నుంచి దుర్వాసన రావడం పక్కింటి వారు గమనించారు. దీంతో వెంటనే నాగరాజు ఇంటికి కిటికిని బద్దలు కొట్టి చూడగా పిల్లలిద్దరు విగతజీవులుగా పడి కనిపించారు. స్థానిక చందానగర్ పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. నాగరాజు ఫ్యానుకు ఉరేసుకుని కనిపించాడు. పడక గదిలో భార్య సుజాత మృతదేహం కనిపించింది. మృతదేహాలు కుళ్లిన దశలో కనిపించాయి. ఇటీవల కొంత కాలం నుంచి భార్య సుజాతతో నాగరాజు తరచూ గొడవ పడుతుండేవాడని, అయితే పిల్లల్ని మాత్రం ఎంతో ప్రేమగా చూసుకునే వాడని స్థానికులు తెలిపారు.
అర్ధరాత్రి సమయంలోనైనా పిల్లలు ఆకలి అంటే ఎదో ఒకటి వారికి అందించే వాడంట. ఇంత మంచి గా ఉండే ఆయన ఇలాంటి దారుణానికి ఒడిగట్టినాడంటే నమ్మలేకపోతున్నామని పోరుగున ఉండే వారు తెలిపారు. అయితే భార్యపై అనుమానంతోనే ఈ దారుణానికి ఒడిగడినట్లు టాక్ వినిపిస్తోంది. ఘటనా స్థలాన్ని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, మియాపూర్ ఏసీపీ కృష్ణ ప్రసాద్ మరియు ఇతర అధికారులు పరిశీలించారు. చూశారు. హాయిగా ఉండే కాపురంలో ఏర్పడిన చిన్న కలహాం మొత్తం కుటుంబాన్నే బలితీసుకుంది.