crime news : ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాడు పెళ్లి విషయంలో తనను మోసం చేస్తున్నాడని భావించిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడి చిత్రం గీసి, సూసైడ్ నోట్ రాసి ప్రాణం తీసుకుంది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన వెంకన్న, శారద దంపతుల కుమార్తె 22 ఏళ్ల శరణ్య అదే గ్రామానికి చెందిన యువకుడ్ని ప్రేమించింది. అతడు ఓ పార్టీ యువజన విభాగం మండల ప్రధాన కర్యాదర్శిగా వ్యవహరిస్తూనే, కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
పెళ్లి విషయంలో ఇద్దరికీ గొడవైంది. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టారు. ఆ యువకుడు పెళ్లికి మరో ఆరు నెలల గడువు అడిగాడు. దీంతో శరణ్య తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. ఓ సూసైడ్ నోట్ రాసింది. అందులో.. ‘‘ అమ్మ, నాన్న మళ్లీ మీ ముందు నేను ఓడిపోయాను. అందరి ముందు మళ్లీ ప్రశ్నగా మిగిలిపోయాను. ఆ రోజు గుడిలో నన్ను పిలిచి మళ్లీ ఆరు నెలలు అని టైం పెడితే తనను నమ్మి మళ్లీ ఓడిపోయాను. నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు బతకాలని లేదు.
సారీ అమ్మ నీకు నేను ఏం చేసినా నీ బుణం తీర్చుకోలేనిది. కానీ, మళ్లీ జన్మంటూ ఉంటే… మనసులో ఉన్న బాధని కూడా రాయలేకపోతున్నా.. నా వల్ల కావట్లేదు అమ్మ మానసికంగా చాలా torture అనుభవిస్తున్నా’’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది. అతడి చిత్రం కూడా గీసింది. అనంతరం చున్నీతో ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నోట్, డ్రాయింగ్, చున్నీని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగటంతో.. లిఖిత పూర్వక ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : స్నేహితుడి ఇంట్లో భార్య! ఓ రోజు రాత్రి బెడ్ రూమ్ లో!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.