ఇటీవల దేశంలో పలు చోట్ల దారుణమైన హత్యలకు సంబంధించిన వార్తలు వెలుగు లోకి వస్తున్నాయి. చిన్న చిన్న విషయాల్లో మనస్ఫర్థలు రావడం.. డేటింగ్ విషయంలో గొడవలు, వివాహేతర సంబంధాల కారణంగా ఈ హత్యలు జరుగుతున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో నేరాల సంఖ్య పెరిగిపోతుంది. చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై విచక్షణ కోల్పోయి ఎదుటివారిపై దాడులకు తెగబడటం.. హత్యలు చేయడం లాంటివి చేస్తున్నారు. ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాల కారణంగా కూడా దారుణ హత్యల పరంపర కొనసాగుతుంది. ప్రేమించిన అమ్మాయి తనకు దక్కదేమో అన్న అనుమానంతో స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన నవీన్, హరిహర కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఓ వ్యక్తిని పెట్రోల్ పోసి దారుణంగా హత్య చేసిన ఘటన మేడ్చల్ దుండిగల్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ నగరంలోని బహదూర్ పల్లిలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా పెట్రోల్ పోసి నిప్పంటించారు. తుప్పల్లో మంటలు రావడం చూసి అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి అక్కడ దృశ్యం చూసి షాక్ తిన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బైక్ నెంబర్ ఆధారంగా ఆ మృతదేహం ఎవరు అన్న విషయం పై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో బైక్ కూడా పూర్తిగా కాలిపోయింది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే ఫోరెన్సీక్ రిపోర్టు ద్వారా చనిపోయిన వ్యక్తి ఎవరు అన్న విషయం తెలుస్తుందని పోలీసులు అంటున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మేడ్చల్ జిల్లా దుండిగల్‌లో దారుణం.. పెట్రోల్ పోసి వ్యక్తిని తగలబెట్టిన దుండగులు.. పూర్తిగా కాలిపోయిన మృతదేహం.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు#Hyderabad #CrimeNews
— NTV Breaking News (@NTVJustIn) March 5, 2023