ఓ తండ్రి క్షణికావేశంలో దారుణానికి పాల్పడ్డాడు. కోడి కూర కోసం గొడవ పడి కన్న కొడుకును అతి కిరాతకంగా హత్య చేశాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
మాములుగా ఈ రోజుల్లో కొందరు భూ వివాదాలు, వివాహేతర సంబంధాలు వంటి కారణాలతో ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. కానీ ఓ వ్యక్తి మాత్రం కేవలం కోడి కూర కోసం కన్న కొడుకుని దారుణంగా హత్య చేశాడు. వినటానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం. తాజాగా కర్ణాటలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని సూలీయా పరిధిలోని గుత్తిగర్ గ్రామం. ఇక్కడే తండ్రి షీనా, కొడుకు శివరామన్ ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. కుటుంబం అంతా కలిసి మెలిసి ఉంటూ సంతోషంగా ఉండేవారు. అయితే మంగళవారం వీరి ఇంట్లో చికెన్ వండారు. దీంతో తండ్రి షీనా ఉన్నదంతా తినేశాడు. కొద్దిసేపటి తర్వాత కొడుకు శివరామన్ ఇంటికి వచ్చి చూసే సరికి చికెన్ గిన్నే ఖాళీగా కనిపించింది. దీంతో కోపోద్రిక్తుడైన కొడుకు శివరామన్.. తండ్రి షీనాతో గొడవ పడ్డాడు. దీంతో ఇదే విషయమై తండ్రీ కొడుకులు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు.
ఇక పట్టరాని కోపంతో ఊగిపోయిన తండ్రి షీనా.. కొడుకు శివరామన్ పై ఇంట్లో ఉన్న ఇనుప రాడ్ తో దాడి చేశాడు. ఈ దాడిలో కుమారుడు రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అనంతరం ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు జరిగిన దారుణం చూసి షాక్ గురయ్యారు. స్థానికులు స్పందించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడు షీనాను అరెస్ట్ చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. కాగా మృతుడికి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. కోడి కూర కోసం కొడుకుని చంపిన తండ్రి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.