ఈ మద్య చాలా మంది చిన్న విషయానికే విచక్షణ కోల్పోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, వివాహేతర సంబంధాల నేపథ్యంలో భార్యాభర్తల మద్య జరిగే చిన్న చిన్న గొడవల కారణంగా క్షణికావేశంలో ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్తున్నాయి.
ఈ మద్య కాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురఅవుతున్నారు. ఆ క్షణికావేశంలో తాము ఏం చేస్తున్నామో అన్న విచక్షణ కోల్పోతున్నారు. అలాంటి సమయంలో కొంతమంది ఎదుటి వారిని దూషించడం.. దాడులు చేయడం, కొన్నిసార్లు ప్రాణాలు తీయడమో.. తామ ప్రాణాలు తీసుకోవడమో చేస్తున్నారు. ఏది ఏమైనా క్షణికావేశంలో తీసుకునే తప్పుడు నిర్ణయం జీవితాలను నాశనం చేస్తుంది. తాజాగా ఓ వివాహిత చిన్న విషయానికి మనస్థాపానికి గురై పాప కోసం ఊయలగా ఏర్పాటు చేసిన చీరతో ఉరివేసుకొని చనిపోయింది. ఈ విషాద సంఘటన ఉప్పల్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
నిజామాబాద్.. డిచ్‌పల్లి చెందిన మనోజ్, పూజితకు అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ప్రస్తుతం ఈ జంట ఐడీఏలోని లక్ష్మీనారాయయణ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇటీవల ఈ జంటకు సంతానం కలిగింది. మనోజ్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పూజిత ఇంట్లో ఉంటూ ఆన్ లైన్ టెలీ మార్కెటింగ్ చేస్తూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుంది. ఆదివారం పూజిత టెలీ మార్కెటింగ్ కి సంబంధించి పనిలో బిజీగా ఉన్న సమయంలో పాప ఏడ్చింది. అయితే పాప ఏంత ఏడుస్తున్నా పట్టించుకోవడం లేదని పూజితను మనోజ్ గట్టిగా మందలించాడు. ఈ క్రమంలో ఇరువు మద్య వాగ్వాదం చోటు చేసుకుంది.
మనోజ్ ఉద్యోగం పనిమీద బయటకు వెళ్లాడు.. భర్త బయటికి వెళ్లి వెంటనే పూజిత గదిలోకి వెళ్లింది. గదిలోకి వెళ్లిన పూజిత ఎంతసేపటికీ రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె అమ్మమ్మ స్థానికుల సహాయంతో తలుపులు తొలగించి చూడగా చీరతో పూజిత ఉరివేసుకుంది. చిన్న విషయంలో భార్యాభర్తల మద్య జరిగిన గొడవ క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.