ఈ మధ్య కాలంలో అనైతిక బంధాలు.. వాటి కారణంగా చోటు చేసుకుంటున్న నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. మరో దారుణ విషయం ఏంటంటే.. ఇలాంటి నేరాల్లో.. నిందితులు ఎక్కువగా ఆడవారే ఉండటం గమనార్హం. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత ప్రియుడితో కలిసి.. భర్తను చంపడం.. లేదంటే.. పరాయి మగాడి మోజులో పడి.. భార్త, పిల్లలను చంపుతున్న కిరాతక మహిళల సంఖ్య పెరిగిపోతుంది. ఇక కొన్ని సంఘటనల్లో.. భార్య చేసిన వెధవ పనికి తట్టుకోలేక.. ప్రాణాలు తీసుకుంటున్నారు కొందరు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
ముద్దులొలికే ఇద్దరు చిన్నారులు, చేతి నిండా డబ్బు.. భార్యకు ప్రభుత్వ ఉద్యోగం.. ఆనందంగా సాగిపోతున్న వారి కుటుంబంలో ఓ అపరిచితుడు ఎంట్రీ ఇచ్చాడు. దాంతో సీన్ మారిపోయింది. ఉద్యోగానికి వెళ్తున్నాని చెప్పి.. ఇంటి నుంచి బయటకు వెళ్తున్న భార్య.. తమ కుటుంబంలోకి ఎంట్రీ ఇచ్చిన అపరిచిత వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీని గురించి భర్తకు తెలిసి మందలించాడు. ఇక మీదట బుద్దిగా ఉంటానని చెప్పిన భార్య.. తన తీరు మార్చుకోలేదు. భార్య ప్రవర్తనతో విసుగు చెందిన భర్త.. తన ప్రాణాలే తీసుకున్నాడు. ఆ వివరాలు..
ఈ విషాదకర సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. సరూర్‌నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న గూడూరు శేఖర్‌కు.. ఎనిమిదేళ్ల క్రితం అనగా.. 2014 ఫిబ్రవరి 14 న మరపాకులా ఏడుకొండలు పెద్ద కూమార్తె నాగాంజలితో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు సంతానం ఉన్నారు. భార్యబిడ్డలతో శేఖర్ జీవితం సంతోషంగా సాగిపోతుంది. ఇక నాగాంజలి హైదరాబాద్‌లోని కేంద్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయంలో పనిచేసేది.
అయితే.. గత మూడేళ్లుగా నాగాంజలి స్వరూప్ రెడ్డి అనే వ్యక్తితో చనువుగా ఉంటుంది. వీరి వ్యవహారాన్ని పసిగట్టిన శేఖర్.. ఒకసారి వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని నిలదీశాడు. ఈ క్రమంలో నాగాంజలి, స్వరూపర్ రెడ్డి.. పెద్దల సమక్షంలో తమ తప్పు ఒప్పుకుని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని క్షమాపణ కోరారు.కొన్నాళ్ల పాటు బుద్దిగా ఉంది నాగాంజలి. ఈ క్రమంలో ఈ ఏడాది ఆమెకు ఆదిలాబాద్ ట్రాన్స్‌ఫర్ అయ్యింది.
అప్పటి దాకా.. మారినట్లు నటించిన నాగాంజలి.. తన అసలు స్వరూపం బటయపెట్టింది. ఆదిలాబాద్‌కు బదిలీ అయిన వెంటనే మళ్లీ స్వరూప్ రెడ్డితో కలిసి ఆదిలాబాద్‌లో సహజీవనం మొదలుపెట్టింది. ఈ విషయం కాస్త.. నాగాంజలి భర్త శేఖర్‌కు తెలిసింది. భార్య చేసిన ద్రోహం తల్చుకుని తీవ్రంగా బాధపడ్డారు. దీని గురించిఎవరికి చెప్పుకోవాలో.. ఏం చేయాలో తెలియని శేఖర్ భార్య తీరుతో తీవ్ర మనస్థాపానికి గురై నవంబర్ 8న మధ్యాహ్నం విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఇది గమనించిన వారు వెంటనే శేఖర్‌ని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. నవంబర్ 9న రాత్రి 10 గంటల సమయంలో శేఖర్ తుది శ్వాస విడిచాడు. సూసైడ్‌కు ముందు శేఖర్ తన ఆవేదనను సెల్ఫీ వీడియోలో రికార్డ్ చేశారు. భార్య తనకు చేసిన ద్రోహం గురించి ప్రస్తావిస్తూ.. కన్నీటి పర్యంతం అయ్యాడు.
ఇక తన కొడుకు శేఖర్ మృతికి కారణమైన నాగాంజలి, అదిలాబాద్ నాబార్డ్‌లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నతేజ స్వరూప్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని.. శేఖర్ తండ్రి గూడూరు శంభయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. శేఖర్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.