ప్రస్తుత కాలంలో ఫోన్ వినియోగం ఓ వ్యసనంలా మారింది. లాక్‌డౌన్ కారణంగా చదువులు కూడా ఆన్‌లైన్ కావడంతో.. పిల్లల చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ దర్శనమిస్తోంది. ఈ క్రమంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దాదాపు ప్రతి ఒక్కరు ఫోన్ వాడకానికి అడిక్ట్ అవుతున్నారు. వద్దని వారిస్తే.. క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి హైదరాబాద్, బోరబండలో వెలుగు చూసింది. కొత్త కోడలు ఫోన్ ఎక్కువగా మాట్లాడుతుందని అత్త మందలించడతో మనస్తాపానికి గురైన నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: అనుమానాస్పదస్థితిలో ఇంజినీరింగ్ విద్యార్ధిని మృతి
సికింద్రాబాద్ అడిక్‌మెట్‌కు చెందిన శిల్ప(22) అనే యువతికి బోరబండలోని భరత్‌నగర్‌కి చెందిన పవన్ అనే వ్యక్తితో మూడు నెలల కింద వివాహం జరిగింది. అయితే ఇటీవల కాలంలో కోడలు ఎక్కువ సమయం ఫోన్ మాట్లాడుతుందని అత్త మందలించింది. దీనిపై ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. జరిగిన సంఘటనతో మనస్తాపం చెందిన శిల్ప ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న ఎస్సార్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే ప్రసుత్తం శిల్ప గర్భవతి అని తెలిసింది. చిన్న విషయానికి ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని.. కడుపులోని బిడ్డను కూడా చంపేసుకుంది అని శిల్ప తల్లిదండ్రులు వాపోతున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో దారుణం: భక్తుడిపై అర్చకుడి దాడి.. బూతు పురాణం!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.