అందమైన భార్య, చక్కటి పిల్లలు, సాఫీగా సాగిపోయే జీవితంలో అనుమానం పెనుభూతంగా మారుతోంది. చిన్న అపార్థాలే పచ్చని సంసారాల్లో చిచ్చును రాజేస్తున్నాయి. చివరకు అవి తారా స్థాయికి చేరి.. విచక్షణ మరచి ఊహించని దారుణాలకు చేరుతున్నాయి. తాజాగా ఓ ఘటన వెలుగు చూసింది.
వివాహ బంధంలో అనుమానం పెనుభూతంగా మారుతోంది. చిన్న అపార్థాలను భూతద్దంలో చూసి కట్టుకున్న వారిని చిత్ర హింసలకు గురి చేస్తున్నారు. అందమైన జీవితంలో చిచ్చు రగల్చుకుంటున్నారు. అనంతరం సంసారాన్ని రోడ్డు పాలు చేసుకుని అభాసుపాలు అవుతున్నారు. అనుమానాలు, అపార్థాలతో భార్యా భర్తల మధ్య ఏర్పడ్డ పొరపచ్ఛాలు పెను విపత్తులకు దారి తీస్తున్నాయి. చివరకు అవి తారా స్థాయికి చేరి.. విచక్షణ మరచి ఊహించని దారుణాలకు చేరుతున్నాయి. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త చంపేసిన ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో చోటుచేసుకుంది.
అందమైన భార్యపై అనుమానం పెంచుకున్న భర్త కత్తితో పొడిచి అతి కిరాకతంగా చంపేశాడు. ఈ ఘటన ములకలపల్లి మండలం మదారంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త గూడెం జిల్లాలోని పాల్వంచకు చెందిన ఆరింపుల రాజేష్‌కు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా విసన్న పేట వాసి నమిత(26)తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అయితే భార్యపై అతడికి అనుమానం ఏర్పడింది. దీంతో ఆమెను అనుమానిస్తూ, వేధిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి బయటకు వెళదామని భార్యకు మాయమాటలు చెప్పాడు. నమ్మిన భార్య అతడి వెంట బయటకు వెళ్లింది.
మాదారంలోని నిర్మానుష ప్రాంతానికి భార్యను రాజేష్ తీసుకెళ్లాడు. ఆమెపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న నమితను గ్రామస్తులు గుర్తించి పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగా ఆమె మృతి చెందింది. ఘటనపై పాల్వంచ సీఐ నాగరాజు, ములకలపల్లి ఎస్సై సాయికిశోర్‌రెడ్డి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. నిందితుడు రాజేష్ కోసం గాలిస్తున్నారు. అనుమానంతో కాపురాలను కూల్చుకుంటున్న ఇటువంటి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.