సినిమాలనే స్ఫూర్తిగా తీసుకుని.. నిజ జీవితంలో పెద్దలు ఎదిరించి.. అవసరమైతే లేచిపోయి పెళ్లి చేసుకుంటారు ప్రేమికులు. కానీ అసలు కథ అక్కడే మొదలవుతుంది. భర్త లేదా భార్య అసలు రంగు అప్పుడే బయట పడుతుంది.
తెలుగు సినిమాల్లో ప్రేమ కథలకు ఉండే కిక్కే వేరు. తెలుగులో ప్రేమకు ఎండ్ కార్డు పడాల్సిందే. లేదంటే ఆ సినిమా అట్టర్ ప్లాప్ చేసేస్తారు టాలీవుడ్ ప్రేక్షకులు. సినిమాలనే స్ఫూర్తిగా తీసుకుని.. నిజ జీవితంలో పెద్దలు ఎదిరించి.. అవసరమైతే లేచిపోయి పెళ్లి చేసుకుంటారు ప్రేమికులు. కానీ అసలు కథ అక్కడే మొదలవుతుంది. భర్త లేదా భార్య అసలు రంగు అప్పుడే బయట పడుతుంది. బేధాభిప్రాయాలు ఏర్పడి.. మెల్లగా గొడవలు జరుగుతాయి. ఇవి తీవ్ర స్థాయికి చేరుకుని.. ఒకరినొకరు అంతమొందించే వరకు వెళతాయి. బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ తరహా ఘటనే చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
సికింద్రాబాద్ నల్లగుట్ట ప్రాంతానికి చెందిన కుమ్మరి లక్ష్మణ్, బీనా 29 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరికి సంతానం లేదు. దీనిపై తరచూ వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. లక్ష్మణ్ ప్రస్తుతం ఐడీపీఎల్ సమీపంలోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. పొరుగు వారితో పాటు ఇంటి ఓనర్లతో సైతం తరచూ భార్య గొడవ పడుతుండటంతో అతను పలు మార్లు ఇళ్లు మారాల్సి వచ్చింది. కొంత కాలం క్రితం ఓల్డ్ బోయిన్‌పల్లిలోని ఫ్రెండ్స్ కాలనీకి మకాం మార్చారు. అయితే వీరి మధ్య గొడవలు మరింత పెరిగాయి. భర్తపై ఆమె పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది.
బీనా ఫిర్యాదు ప్రకారం.. బేగంపేటలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్‌కు పిలవడంతో .. అతడు హాజరయ్యాడు. భార్య చేసిన తప్పుకు తాను శిక్ష అనుభవించాల్సి వస్తుందన్న కోపంతో ఊగిపోయాడు. ఆమెను చంపేయాలని భావించి.. మంగళవారం ఉదయం ఆమె మెడకు ఎలక్ట్రికల్ వైర్ బిగించి హత్య చేశాడు. ఈ విషయం స్థానికులకు తెలిసి.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు