SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » business » Papaya Cultivation Business Idea

పల్లెటూరులో ఉంటూ బొప్పాయి సాగుతో లక్షలు సంపాదించుకోవచ్చు!

పల్లెటూరులోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంది. తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందవచ్చు. అదెలాగో చూసేయండి.

  • Written By: Nagarjuna
  • Published Date - Tue - 27 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Papaya Cultivation Idea: పల్లెటూరులో ఉంటూ బొప్పాయి సాగుతో లక్షలు సంపాదించుకోవచ్చు!

పల్లెటూర్లలో ఉండి, సొంతంగా భూమి ఉన్న వారికి ఈ వ్యాపారం బాగా ఉపయోగపడుతుంది. వ్యవసాయమే అయినా ఇది సరిగ్గా చేస్తే రైతులకు లాభసాటి వ్యాపారం అవుతుంది. మంచి కమర్షియల్ బిజినెస్ ఇది. బొప్పాయి సాగు గురించి తెలిసే ఉంటుంది. ఫిబ్రవరి-మార్చి నెలల్లో గానీ.. జూన్-జూలై నెలల్లో గానీ.. అక్టోబర్-నవంబర్ నెలల్లో గానీ బొప్పాయి పంట వేస్తారు. ఈ కాలాల్లో అయితేనే బొప్పాయి సాగుకి అనుకూలంగా ఉంటుంది. ఒక మూడు లక్షలు పెట్టుబడి పెట్టుకుంటే ఏడాదిలోనే పెట్టుబడి తీసేయగా అదనంగా రూ. 3 లక్షలు లాభం పొందవచ్చు. బొప్పాయి సాగు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఎకరం భూమిలో ఎన్ని మొక్కలు పడతాయి? ఎంత ఆదాయం ఉంటుంది? లాభమెంత? వంటి వివరాలు మీ కోసం.

ప్రతి సారీ పెట్టే పెట్టుబడి:

  • భూమిని చదును చేయడానికి: 10 వేలు
  • ఎరువులకు: 10 వేలు
  • పురుగుల మందుకి: 5 వేలు
  • కూలీల ఖర్చు: 45 వేలు
  • ఇతర ఖర్చులకు: 5 వేలు
  • మొత్తం పెట్టుబడి: 75 వేలు

ఒకసారి మాత్రమే పెట్టే పెట్టుబడి:

  • ఫెన్సింగ్ కి: 30 వేలు
  • డ్రిప్ పైప్ ఇరిగేషన్ సిస్టంకి: 35 వేలు
  • బోర్ వేయడానికి, మోటార్ పంపుకి: 50 వేలు
  • కూలీలకు పాక వేయడానికి: 10 వేలు
  • వాటర్ ట్యాంక్ కి: 5 వేలు
  • మొత్తం పెట్టుబడి: లక్ష ముప్పై వేలు అవుతాయి.

మొక్క ఖరీదు:

  • ఒక్కో మొక్క: రూ. 25/-
  • ఒక ఎకరానికి (1500 మొక్కలు): రూ. 37,500/-
  • ఒక ఎకరానికి (1700 మొక్కలు): రూ. 42,500/-

బొప్పాయి పంట వేయడం నుంచి దిగుబడి వచ్చేంత వరకూ మొత్తం ఖర్చు రూ. 2,42,500 నుంచి రూ. 2,47,500 అవుతుంది. మొక్కకి మొక్కకి మధ్య 1.8 x 1.8 మీటర్ దూరం ఉండేలా నాటాలి. అంటే 6 అడుగుల దూరం ఉండాలి. లేదంటే 1.5 x 1.5 మీటర్ దూరం అంటే 5 అడుగుల దూరం ఉండేలా నాటుకోవచ్చు. ఒక ఎకరానికి ఆరడుగుల గ్యాప్ ఇస్తే 1500 మొక్కలు పడతాయి. 5 అడుగుల గ్యాప్ ఇస్తే 1700 మొక్కలు పడతాయి. మొక్కలు నాటిన 9వ నెల నుంచి పంట చేతికొస్తుంది. రెండున్నర సంవత్సరాల వరకూ దిగుబడి ఉంటుంది. 2 నెలలకొకసారి దిగుబడి ఉంటుంది. అంటే మొక్కలు నాటిన 11 నెలలు ఎలాంటి ఆదాయం ఉండదు కానీ 11 నెలలో చేతికి పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది.

papaya

Join Our Whatsapp Channel

ఎకరంలో 1500 మొక్కలు వేస్తే ఒక్కో మొక్క యావరేజ్ గా 20 నుంచి 40 కాయలను ఇస్తుంది. అంటే ఒక్కో చెట్టు 20 కిలోల దిగుబడి ఇచ్చినా గానీ 1500 చెట్లకు 30 వేల కిలోలు (30 టన్నులు) కాయలు ఇస్తుంది. బయట మార్కెట్లో కిలో బొప్పాయి రూ. 20 ఇస్తారు. అంటే 30 టన్నులకు రూ. 6 లక్షలు ఆదాయం వస్తుంది. ఇందులో పెట్టుబడి రూ. 3 లక్షలు తీసేసినా గానీ రూ. 3 లక్షలు లాభం ఉంటుంది. 9వ నెలలో కాపు కాయడం మొదలుపెట్టాక ప్రతీ 2 నెలలకొకసారి దిగుబడి వస్తూనే ఉంటుంది. ఇలా రెండున్నరేళ్ల వరకూ దిగుబడి వస్తూనే ఉంటుంది. ఈ ఆదాయమే కాకుండా.. అంతర్గత పంటలు వేసుకోవచ్చు. కూరగాయలు లాంటివి వేసుకుంటే అదనంగా కొంత ఆదాయం సమకూరుతుంది. కష్టపడడం, మంచి ఎరువు వేసి మొక్కలను బాగా చూసుకుంటే ఆశించిన ఫలితం ఉంటుంది. పొలం చుట్టూ గ్రీన్ నెట్ పెట్టించుకుంటే మొక్కలు గాలికి పడిపోకుండా ఉంటాయి.

గమనిక: పైన తెలుపబడిన వివరాల్లో మార్పులు ఉండవచ్చు. ఆయా ప్రాంతాల వారీగా కాస్ట్ అనేది ఉంటుంది. పెట్టుబడి వ్యయం పెరగొచ్చు, తగ్గచ్చు. అలానే పంట వేసే ముందు అనుభవజ్ఞుల సూచనలు, సలహాలు తీసుకోవాల్సిందిగా మనవి.

Tags :

  • Business Ideas
  • business news
  • Farming
  • Papaya Cultivation
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సూరత్ బిజినెస్‌మెన్ ఉద్యోగులకు దివాళి బోనస్.. 20 మందికి రూ.1 లక్ష చొప్పున అందజేత

దీపావళి బోనస్ అంటే ఇలా ఉండాలి! ఒక్కో ఉద్యోగికి రూ.1 లక్షకు పైగా ఇచ్చిన యజమాని.. కన్నీళ్లు పెట్టుకున్న సిబ్బంది

  • TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

    TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam