బల్గేరియాలో జరిగిన అందాల పోటీలో విజయవాడకు చెందిన నాగమల్లిక అనే మహిళ సత్తా చాటి టైటిల్ ను ఎగరేసుకుపోయింది. మిసెస్ ప్లానెట్ టైటిల్ ను గెలుచుకున్న ఈ మహిళ అరుదైన ఘనతను సాధించింది. 60 దేశాలకు చెందిన మహిళలు పోటీపడ్డ ఈ అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన నాగమల్లిక ఈ ఘనత సాధించడం విశేషం. అసలు ఈ నాగమల్లిక ఎవరు? మిసెస్ ప్లానెట్ టైటిల్ ను గెలవడానికి ఆమె చేసిన కృషి ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆమె పేరు నాగమల్లికి. భర్త పేరు జితేంద్ర. ఇతను వ్యాపారంలో కొనసాగుతున్నాడు. వీరు ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఆటోనగర్ లో నివాసం ఉంటున్నారు. ఈమెకు 6వ తరగతి చదివే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే నాగమల్లికకు చిన్నప్పటి నుంచి అందాల పోటీపై ఆసక్తిగా ఉండడంతో ఆ దిశగా అడుగులు వేసింది. ఇప్పటి వరకు అనేక అందాల పోటీలో పాల్గొన్న నాగమల్లిక 2019లో మిసెస్ అమరావతి, 2020లో మిసెస్ ఆంధ్రప్రదేశ్, 2021 లో మిసెస్ ఇండియా టైటిల్స్ ను గెలుచుకుంది.
ఇది కూడా చదవండి: SBI WhatsApp Banking: ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అకౌంట్ బ్యాలెన్స్, మినీ స్టేట్మెంట్.. అన్ని వాట్సాప్ లోనే..!

ఇన్ని టైటిల్స్ గెలుచుకున్న మల్లిక.., 2022 సంవత్సరానికి బల్గేరియాలో జరుగుతున్న అందాల పోటీపై కన్నేసింది. ఎలాగైన మిసెస్ ప్లానెట్ టైటిల్ గెలవాలనే పట్టుదలతో పోటీలో నెగ్గి కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన మల్లిక.. నా భర్త ప్రోత్సాహం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానని, ఈ స్థాయికి రావడానికి నేను ఎంతో కష్టపడ్డానని తెలిపింది. అయితే ఇంతకాలం చాలా టైటిల్స్ వేటలో ఉన్న నేను.. ఇక కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నట్లు ఆమె తెలిపింది. ఈ ఘనత సాధించడంతో ఆమె బంధువులు, స్నేహితులు స్థానిక ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలుగు మహిళ ఈ ఘనత సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
