ఫేస్ బుక్ లో పరిచయమైన యువతిని బ్లాక్ మెయిల్ చేసి.. ఆయువతి చేతిలోనే చావు దెబ్బలుతిన్నాడు ఓ యువకుడు. కర్నూలు జిల్లా ఆలూరు జిల్లాకు చెందిన యువకుడికి.. ఏలూరుకి చెందిన యువతి పరిచయమైంది. తరువాత ఆ యువకుడు ఆమెతో స్నేహం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆమె తో ఫోటోలు కూడా దిగాడు. తరువాత అవసరం ఉందని ఆమె నుంచి కొంత డబ్బు తీసుకున్నాడు. అంతటితో ఆగలేదు. మరింత డబ్బులు కావాలని లేకుంటే ఫోటోలు సోషల్ మీడియా లో అప్ లోడ్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.
దీంతో అప్పు చేసి మరీ అతడికి డబ్బులు ఇచ్చింది. అయిన కూడా అసభ్యకరంగా ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. విషయం తెలుసుకున్న యువతి నేరుగా ఆలూరులోని ఆ యువకుడి ఇంటికి వెళ్లింది. అతడిపై ఓ రేంజ్ లో విరుచుక పడింది. నిన్ను చంపడానికి అరుంధతి రావాల రా! అంటూ ఆ వ్యక్తిపై చెప్పుతో చెడమడ వాయించింది. ఇంతలో విషయం తెలుసుకుని అక్కడి చేరుకున్న పోలీసులు ఇరువురిని విడిపించారు. యువకుడి పోలీస్ స్టేషన్ కు తరలించి.. పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.