ఇటీవల భార్యాభర్తల మద్య వచ్చే చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి ఎన్నో అనర్ధాలకు దారి తీస్తున్నాయి. పెద్దలు జోక్యం చేసుకొని చెప్పినప్పటికీ.. విడాకులు కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు.
వివాహబంధం ఎంతో పవిత్రమైనది. ఏడడుగులు.. మూడుముళ్ళ బంధంతో ఒక్కటైన జంటని నిండు నూరేళ్లు కలిసి ఉండాలని దీవిస్తుంటారు పెద్దలు. కానీ ఈ మద్య పట్టుమని ఒక్క సంవత్సరం కూడా తిరగకముందే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు భార్యాభర్తలు. సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం కామన్.. సంసారం అన్న తర్వాత గొడవలు జరుగుతూనే ఉంటాయి. అలా గొడవలు వస్తే సర్ధుకుపోతే కాపురం ప్రశాంతంగా సాగుతుంది.. గొడవలు పెద్దగా మారితే భార్య భర్తల మధ్య దూరం పెరుగుతుంది. విడాకుల వరకు వెళ్తుంది. భర్తతో గొడవపడిన భార్య పుట్టింటికి వెళ్లింది. అత్తగారింటికి వెళ్లిన భర్తకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..
గుంటూరు జిల్లాకు చెందిన తారచంద్ నాయక్ కి కర్నూల్ జిల్లాకు చెందిన పుష్పవతి 2015 లో వివాహం జరిగింది. పెళ్లైన కొత్తలో భార్యాభర్తలు బాగానే ఉన్నారు. వీరికి ఇద్దరు సంతానం. గత రెండేళ్లుగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం మొదలయ్యాయి. భర్తతో గొడవ పడిన ప్రతిసారి పుష్పవతి పిల్లల్ని తీసుకొని తన పుట్టింటికి వెళ్లేది. ఎలాగో అలా నచ్చజెప్పి తన భార్యను ఇంటికి తీసుకువచ్చేవాడు నాయక్. ఈ మద్య భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవలు రావడంతో ఈసారి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదని తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది పుష్పవతి.. ఆ సమయంలో భార్యను నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని తిట్టాడు తారచంద్ నాయక్.
తన భార్యా పిల్లలు పదే పదే గుర్తుకు రావడంతో అత్తగారి ఇంటికి వెళ్లాడు నాయక్. ఈ క్రమంలోనే తన భార్యను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు తారచంద్. అంతే ఒక్కసారే నాయక్ నాలుకు కొరికేసింది పుష్పవతి. ఏం జరుగుతుందో కొద్ది సేపు నాయక్ కి అస్సలు అర్థం కాలేదు.. నాలుకకు గాయమై తీవ్ర రక్త స్త్రావం అయ్యింది. వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లగా.. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. భార్యను తగ్గరకు తీసుకుంటే ఇలా నాలుక కోరికేసినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్య ప్రవర్తన సరిగా లేదని.. తన భార్య వల్ల ప్రాణహాని ఉందని తారాచంద్ వాపోయాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అన్నాడు. మరోవైపు తన ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా ముద్దు పెట్టాలని చూశాడని.. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక నాలుకు కొరికినట్లు పుష్పవతి తెలిపింది. తాను కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది.