ఈ వివాహితకు పెళ్లై ఏడాది కావొస్తుంది. తెల్లారితే పెళ్లి రోజు. ఆ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని దంపతులు ఇద్దరూ అనుకున్నారు. కానీ, ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో ఆ వివాహిత ఏం చేసిందో తెలిస్తే షాకవుతారు.
ఈ యువతికి గతేడాది వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి భార్యాభర్తలు సంతోషంగానే ఉన్నారు. భర్త స్థానికంగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలా ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అయితే, ఈ వివాహిత ఇటీవల పుట్టింటికి వెళ్లింది. కాగా, వీరి పెళ్లై ఏడాది కావొస్తుంది. ఇక తెల్లారితే పెళ్లి రోజు. ఘనంగా పెళ్లి రోజు వేడుకలు జరుపాలని అంతా అనుకున్నారు. కానీ, ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో ఆ వివాహిత ఏం చేసిందో తెలుసా?
పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా అల్లూరుకు చెందిన కృష్టం రాజు అనే యువకుడితో పగిడ్యాలకు చెందిన చంద్రకళ (23)కు గతేడాది వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి దంపతులు సంతోషంగానే ఉన్నారు. వీరి దాంపత్య జీవితం కూడా సాఫీగానే సాగింది. అయితే, వారం రోజుల కిందట చంద్రకళ పుట్టింటికి వెళ్లింది. ఇక వీరి వివాహం జరిగి ఏడాది కావొస్తుంది. తెల్లారితో పెళ్లి రోజు. ఇదిలా ఉంటే, గత కొంత కాలం నుంచి చంద్రకళ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఆదివారం కూడా ఆ నొప్పి మరింత ఎక్కువైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు.
దీంతో చంద్రకళకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఇక చేసేదేం లేక ఆ వివాహిత ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గమనించి వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఇంటికి చేరుకుని ఫ్యానుకు వేలాడుతున్న చంద్రకళను చూసి షాక్ గురయ్యారు. సోమవారం పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవాల్సిన కూతురు ఇలా శవమై కనిపించడంతో ఆమె తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.