నేటికాలంలో చాలామంది యువతలో ఆత్మవిశ్వాసం, ధైర్యం వంటి కొరవడుతున్నాయి. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడిపోతున్నారు. తాము జీవితంలో ఇంకేమి సాధించలేమని తీవ్ర నిరాశలకు లోనవుతున్నారు. కొందరు పరీక్షల్లో ఫెయిల్ అయినా, ఉద్యోగం రాకపోయినా, పెళ్లికాక పోయినా తీవ్ర మానసిక వేదనకు గురై.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఇంజినీరింగ్ విద్యార్థిని దారుణ నిర్ణయం తీసుకుంది.
నేటికాలంలో చాలామంది యువతలో ఆత్మవిశ్వాసం, ధైర్యం వంటి కొరవడుతున్నాయి. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడిపోతున్నారు. తాము జీవితంలో ఇంకేమి సాధించలేమని తీవ్ర నిరాశలకు లోనవుతున్నారు. కొందరు పరీక్షల్లో ఫెయిల్ అయినా, ఉద్యోగం రాకపోయినా, పెళ్లికాక పోయినా తీవ్ర మానసిక వేదనకు గురై.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే కుటుంబ సభ్యులు మందలించినా కూడా మనస్తాపంతో బలనవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం కొత్తగుంటకు చెందిన వెంకటయ్య, హైమావతి భార్యాభర్తలు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే ఈ దంపతులిద్దరూ పదేళ్ల కిందట మరణించడంతో వారి పిల్లలు బాబాయి పెంచలయ్య పర్యవేక్షణలో జీవిస్తున్నారు. వెంకటయ్య, హైమావతి దంపతుల పెద్ద కుమార్తె అనూష(21) తిరుపతిలోని మహిళ యూనివర్సిటీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. తాను కష్టపడి చదివి.. తన చెల్లి, తమ్ముడిని బాగా చూసుకోవాలని ఎన్నో కలలు కనేది.
ఈక్రమంలో తిరుపతి పట్టణంలోని శ్రీకృష్ణానగర్ లో కొంతమంది స్నేహితురాళ్లతో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. స్నేహితురాళ్లతో కలిసి కాలేజీకి వెళ్లి వస్తుండేది. అలానే తరచూ తన బంధువులతో ఫోన్ లోమాట్లాడుతుండేది. అలానే ఆదివారం రాత్రి కూడా చాలా సమయం ఫోన్‌లో బంధువులతో మాట్లాడింది. ఫోన్ మాట్లాడిన తరువాత చాలా డల్ గా అనూష ఉంది. ఫోన్ మాట్లాడిన తర్వాత స్నేహితులతో కలిసి నిద్రపోయింది. తిరిగి సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు నిద్ర లేచి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
మృతురాలి స్నేహితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడి విద్యార్థుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. అలానే మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు. మృతురాలి సోదరుడు లీలా సాయికృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ యువతి ఆత్మహత్య చేసుకోవడానికి గల అసలు కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. మరి.. ఎంతో భవిష్యత్ ఉన్న యువతి ఇలా బలవన్మరణానికి పాల్పడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.