SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » andhra pradesh » Pslv C 52 Experiment Successful

పీఎస్ఎల్వీ సి-52 ప్రయోగం విజయం… ఇస్రోలో సంబరాలు

  • Written By: Rama Krishna
  • Updated On - Mon - 14 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పీఎస్ఎల్వీ సి-52 ప్రయోగం విజయం… ఇస్రోలో సంబరాలు

ఈ ఏడాది ఇస్రో తొలి ప్రయోగం మొదలైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి ఉదయం 5.59 గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ రాకెట్ మూడు ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యల్లో ప్రవేశపెట్టింది.  ఈ ఉపగ్రహాల్లో భూ పరిశీలన శాటిలైట్ ఈఓఎస్-04 కూడా ఉంది. ఈఓఎస్-04 ఉపగ్రహాన్ని భూమికి 529 కిలోమీటర్ల ఎత్తున సోలార్ సింక్రోనస్ ఆర్బిట్ లో సజావుగా ప్రవేశపెట్టారు. ఈ నెల 13వ తేదీ వేకువజామున 4.29 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం కాగా.. నిరంతరాయంగా 25 గంటల 30నిముషాలపాటు కౌంట్ డౌన్ కొనసాగింది.

ఇది చదవండి: IPL 2022: ఒకేరోజు రెండు జాక్‌పాట్లు కొట్టిన శివమ్ దూబే!

నిప్పులు చెరుగుతూ.. పీఎస్‌ఎల్‌వీ నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ మొత్తం 3 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశ పెడుతుంది. ఆర్‌ఐశాట్‌-1ఎ (ఈవోఎస్‌-04)తోపాటు ఐఎన్‌ఎస్‌-2టీడీ, విద్యార్థులు రూపకల్పన చేసిన ఇన్‌స్పైర్‌శాట్‌-1 ఉపగ్రహాలను మోసుకెళ్తోంది. ఈ శాటిలైట్ బరువు 1,710 కేజీలు. ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ భూమిని అత్యంత స్పష్టతతో చిత్రీకరించగలదు. ఇది ప్రధానంగా వ్యవసాయం, అటవీశాఖ, ఉద్యానవనాలు, భూమిలో తేమ, జలవనరులు, వరదలు వంటి అంశాల్లో విశేషంగా తోడ్పాటు అందిస్తుంది. మిగిలిన రెండు ఉపగ్రహాలు చిన్నవి. వీటిలో ఒకటి స్టూడెంట్ శాటిలైట్ కాగా, మరొకటి టెక్నాలజీ డెమాన్ స్ట్రేటర్ శాటిలైట్. గతంలో ప్రయోగించిన EOS-03 రాకెట్ ప్రయోగం విఫలం కారణంగా నింగిలోకి వెళ్లలేదు. ఈ సిరీస్ లో నాలుగో ఉపగ్రహాన్ని నేడు ప్రయోగించారు. డెమాన్ స్ట్రేటర్ శాటిలైట్ ను గతంలో ప్రయోగించిన ఇండియా-భూటాన్ సంయుక్త ఉపగ్రహం ఐఎన్ఎస్-2బీకి కొనసాగింపుగా ప్రయోగించారు.

పీఎస్ఎల్వీ సి-52 విజయంతో ఇస్రోలో సంబరాలు చేసుకున్నారు. శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు మిన్నంటాయి. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో ఇస్రో అధిపతి డాక్టర్‌ సోమనాథ్‌ ఆధ్వర్యంలో ఈ ప్రయోగం జరిగింది. ఇస్రో చైర్మన్ గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన మొదటి ప్రయోగం ఇది. ఈ ఏడాదికి కూడా ఇదే తొలి ప్రయోగం. అగ్రదేశాలకు దీటుగా భారత్ ను నిలపడంలో ఇస్రో కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.

WATCH NOW –
The Launch of PSLV- C52/EOS-04 from Satish Dhawan Space Centre (SHAR), Sriharikota on @DDNational & Live-Stream on https://t.co/jX1SNL3r7E#PSLVC52 #EOS04 pic.twitter.com/PaGNyJUYUr

— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) February 14, 2022

India’s Polar Satellite Launch Vehicle PSLV-C52 injected Earth Observation Satellite EOS-04, into an intended sun synchronous polar orbit of 529 km altitude at 06:17 hours IST on February 14, 2022 from Satish Dhawan Space Centre, SHAR, Sriharikota. https://t.co/BisacQP8Qf

— ISRO (@isro) February 14, 2022

పీఎస్ఎల్వీ సి 52 విజయవతం అవ్వడం పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదలైంది. భూ పరిశీలనా ఉపగ్రహంతో పాటు, రెండు ఇతర ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టడం పట్ల సీఎం అభినందనలు తెలియజేశారు. అభివృద్ధి చెందిన దేశాల స్థాయిలో భారతదేశ అంతరిక్ష పరిశోధన సామర్థ్యాలను ఇస్రో మరింత ఇనుమడింపజేసిందని సీఎం జగన్ కొనియాడారు. ఇస్రో ఇకమీదట కూడా ప్రతి ప్రయోగంలోనూ విజయవంతం కావాలని అభిలషించారు.

Tags :

  • ISRO
  • Nellore district
  • PSLV-C52
  • Sriharikota
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

జయహో భారత్.. జాబిల్లిని ముద్దాడిన చంద్రయాన్ 3

జయహో భారత్.. జాబిల్లిని ముద్దాడిన చంద్రయాన్ 3

  • చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అవ్వాలంటూ ముస్లిం సోదరుల ప్రార్థనలు..

    చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అవ్వాలంటూ ముస్లిం సోదరుల ప్రార్థనలు..

  • ఇస్త్రో అద్భుతం.. విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-3

    ఇస్త్రో అద్భుతం.. విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-3

  • నెల్లూరు నారాయణపై తమ్ముడి భార్య ఆరోపణలు!

    నెల్లూరు నారాయణపై తమ్ముడి భార్య ఆరోపణలు!

  • రూ.1.6 కోట్ల విలువైన మొబైల్స్ రికవరీ.. బాధితులకు అందజేత!

    రూ.1.6 కోట్ల విలువైన మొబైల్స్ రికవరీ.. బాధితులకు అందజేత!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam