ఈ ఏడాది ఇస్రో తొలి ప్రయోగం మొదలైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి ఉదయం 5.59 గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ రాకెట్ మూడు ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యల్లో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహాల్లో భూ పరిశీలన శాటిలైట్ ఈఓఎస్-04 కూడా ఉంది. ఈఓఎస్-04 ఉపగ్రహాన్ని భూమికి 529 కిలోమీటర్ల ఎత్తున సోలార్ సింక్రోనస్ ఆర్బిట్ లో సజావుగా ప్రవేశపెట్టారు. ఈ నెల 13వ తేదీ వేకువజామున 4.29 గంటలకు కౌంట్ డౌన్ […]