ఈ ఏడాది ఇస్రో తొలి ప్రయోగం మొదలైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి ఉదయం 5.59 గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ రాకెట్ మూడు ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యల్లో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహాల్లో భూ పరిశీలన శాటిలైట్ ఈఓఎస్-04 కూడా ఉంది. ఈఓఎస్-04 ఉపగ్రహాన్ని భూమికి 529 కిలోమీటర్ల ఎత్తున సోలార్ సింక్రోనస్ ఆర్బిట్ లో సజావుగా ప్రవేశపెట్టారు. ఈ నెల 13వ తేదీ వేకువజామున 4.29 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం కాగా.. నిరంతరాయంగా 25 గంటల 30నిముషాలపాటు కౌంట్ డౌన్ కొనసాగింది.
ఇది చదవండి: IPL 2022: ఒకేరోజు రెండు జాక్‌పాట్లు కొట్టిన శివమ్ దూబే!
నిప్పులు చెరుగుతూ.. పీఎస్‌ఎల్‌వీ నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ మొత్తం 3 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశ పెడుతుంది. ఆర్‌ఐశాట్-1ఎ (ఈవోఎస్-04)తోపాటు ఐఎన్‌ఎస్-2టీడీ, విద్యార్థులు రూపకల్పన చేసిన ఇన్‌స్పైర్‌శాట్-1 ఉపగ్రహాలను మోసుకెళ్తోంది. ఈ శాటిలైట్ బరువు 1,710 కేజీలు. ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ భూమిని అత్యంత స్పష్టతతో చిత్రీకరించగలదు. ఇది ప్రధానంగా వ్యవసాయం, అటవీశాఖ, ఉద్యానవనాలు, భూమిలో తేమ, జలవనరులు, వరదలు వంటి అంశాల్లో విశేషంగా తోడ్పాటు అందిస్తుంది. మిగిలిన రెండు ఉపగ్రహాలు చిన్నవి. వీటిలో ఒకటి స్టూడెంట్ శాటిలైట్ కాగా, మరొకటి టెక్నాలజీ డెమాన్ స్ట్రేటర్ శాటిలైట్. గతంలో ప్రయోగించిన EOS-03 రాకెట్ ప్రయోగం విఫలం కారణంగా నింగిలోకి వెళ్లలేదు. ఈ సిరీస్ లో నాలుగో ఉపగ్రహాన్ని నేడు ప్రయోగించారు. డెమాన్ స్ట్రేటర్ శాటిలైట్ ను గతంలో ప్రయోగించిన ఇండియా-భూటాన్ సంయుక్త ఉపగ్రహం ఐఎన్ఎస్-2బీకి కొనసాగింపుగా ప్రయోగించారు.
పీఎస్ఎల్వీ సి-52 విజయంతో ఇస్రోలో సంబరాలు చేసుకున్నారు. శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు మిన్నంటాయి. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లో ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ ఆధ్వర్యంలో ఈ ప్రయోగం జరిగింది. ఇస్రో చైర్మన్ గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన మొదటి ప్రయోగం ఇది. ఈ ఏడాదికి కూడా ఇదే తొలి ప్రయోగం. అగ్రదేశాలకు దీటుగా భారత్ ను నిలపడంలో ఇస్రో కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.
WATCH NOW –
The Launch of PSLV- C52/EOS-04 from Satish Dhawan Space Centre (SHAR), Sriharikota on @DDNational & Live-Stream on https://t.co/jX1SNL3r7E#PSLVC52 #EOS04 pic.twitter.com/PaGNyJUYUr— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) February 14, 2022
India’s Polar Satellite Launch Vehicle PSLV-C52 injected Earth Observation Satellite EOS-04, into an intended sun synchronous polar orbit of 529 km altitude at 06:17 hours IST on February 14, 2022 from Satish Dhawan Space Centre, SHAR, Sriharikota. https://t.co/BisacQP8Qf
— ISRO (@isro) February 14, 2022
పీఎస్ఎల్వీ సి 52 విజయవతం అవ్వడం పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదలైంది. భూ పరిశీలనా ఉపగ్రహంతో పాటు, రెండు ఇతర ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టడం పట్ల సీఎం అభినందనలు తెలియజేశారు. అభివృద్ధి చెందిన దేశాల స్థాయిలో భారతదేశ అంతరిక్ష పరిశోధన సామర్థ్యాలను ఇస్రో మరింత ఇనుమడింపజేసిందని సీఎం జగన్ కొనియాడారు. ఇస్రో ఇకమీదట కూడా ప్రతి ప్రయోగంలోనూ విజయవంతం కావాలని అభిలషించారు.