ప్రజలకి ఏ కష్టం వచ్చినా.. మేమున్నాం అంటూ అభయహస్తం అందించడం మన తెలుగు హీరోలకి అలవాటు. ఇలాంటి రియల్ స్టార్స్ ఇప్పుడు మరోసారి మంచి మనసు చాటుకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాల వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఆ వరదలు మిగిల్చిన నష్టం నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు. ఇలాంటి సమయంలో స్టార్ హీరోలు ఒక్కొక్కరు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కి భారీ విరాళాలు ప్రకటిస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా జాయిన్ అయ్యారు. ప్రభాస్ తన వంతుగా వరద బాధితుల సహాయార్ధం సీఎంఆర్‌ఎఫ్‌కు రూ. కోటి విరాళాన్ని ప్రకటించారు.
ముందునుండి ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో ముందుండే ప్రభాస్ ఇలా విరాళం ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కరోనా సమయంలోనూ, హైదరాబాద్ నగరం వరదల్లో మునిగినప్పుడు కూడా తన వంతుగా సహాయం అందించారు. ఇక ప్రభాస్ కన్నా ముందే.. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్, మహేశ్ బాబు, జూనియర్ యన్టీఆర్ వంటి స్టార్ హీరోలు ఏపీ వరద బాధితుల కోసం విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. మరి.. ఇలాంటి కష్ట సమయంలో మన స్టార్ హీరోలు ప్రజలకి అండగా నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.