సింగర్ పార్వతి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మారుమూల పల్లెలో జన్మించిన పార్వతి.. ఓ ప్రముఖ చానెల్ నిర్వహిస్తోన్న పాటల పోటీలో పాల్గొన్నది. కోకిల కన్నా మధురంగా ఉన్న ఆమె గాత్రానికి జడ్జీలు ఫిదా అయ్యారు. ఈ క్రమంలో ఏం కావాలో కోరుకో అంటే.. తన ఊరికి బస్సు లేదని.. దాని వల్ల తాను ఎలాంటి ఇబ్బందులు పడిందో వివరించిన పార్వతి.. తన ఊరికి బస్సు వచ్చేలా చూడమని కోరింది. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పార్వతి కోరిక నెరవేరింది.
ఆమె గ్రామానికి బస్సు వచ్చింది. అయితే పార్వతి గ్రామానికి బస్సు రావడం వెనక మంత్రి పేర్ని నాని, బొత్స సత్యనారాయణల కృషి ఎంతో ఉందన్న టాక్ బయటకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా నిరూపిస్తూ.. ప్రముఖ ఛానెల్ ప్రోమో రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో పార్వతి పాటకి ముగ్ధుడైన ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడిన మాటలు చూపించారు. అధికారులతో మాట్లాడి.. పార్వతి ఉరికి బస్సు ఏర్పాటు చేస్తామని పేర్ని నాని మాట ఇవ్వడం ప్రోమోలో హైలెట్ గా నిలిచింది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.