ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. సీఎం జగన్ కి ఎంతో విధేయుడిగా ఉండేవారిలో పేర్నినాని ఒకరు అంటారు. ప్రతిపక్ష నేతలపై తనదైన మాటల తూటాలు పేలుస్తుంటారు.
ఎప్పుడూ ప్రతిపక్షాల విమర్శలపై స్పందించే వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని ఓ వృద్ధురాలి పట్ల మానవత్వాన్ని చాటుకున్నారు. మండుటెండలో కాళ్లకు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్తోన్న వృద్ధురాలి పట్ల పెద్ద మనసు ప్రదర్శించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా బర్నింగ్ టాపిక్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. తమ వల్లే కేంద్రం వెనక్కి తగ్గిందంటూ బీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. హరీశ్ కామెంట్స్ కు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డికి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నమ్మక ద్రోహం చేశారని మాజీ మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటంరెడ్డి ఫోన్‌ను ఎవరూ ట్యాప్ చేయలేదని, ఆయన స్నేహితుడే కాల్ రికార్డింగ్ చేశాడని చెప్పారు. పేర్నినాని గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ రామశివారెడ్డి అనే కాంట్రాక్టర్ కోటం రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అతడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అభిమాని. అతడు కోటంరెడ్డి కాల్స్‌ను రికార్డ్ చేశాడు. పార్టీలో అందరికీ సర్క్యులేట్ చేశాడంట. టాప్ చేశారు […]
ఏపీ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఏపీలో పార్టీల మధ్య రాజకీయ వేడి రాజుకొంది. విశాఖ గర్జన, జనసేన జనవాణి కార్యక్రమాలతో మొదలైన పొలిటికల్ హీట్ ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. విశాఖలో పవన్ కల్యాణ్‌ను అడ్డుకున్నారని, వేధించారంటూ జనసేన, టీడీపీ, బీజేపీ వాదిస్తుండగా.. జనసేన కార్యకర్తలు మాపై దాడిచేశారు అంటూ వైసీపీ మంత్రులు ఆరోపణలు చేస్తున్నారు. విశాఖ ఘటన తర్వాతి నుంచి పవన్ కల్యాణ్ ప్రెస్‌మీట్లు పెట్టడం, సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉన్నారు. తాజాగా మంగళగిరి పార్టీ […]
ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు డేట్ ఫిక్స్ కావడంతో ఆశావహుల్లో ఉత్కంఠ పెరిగిపోయింది. ఈనెల 7న మంత్రులు రాజీనామా చేస్తారని.. 11న కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తారని గత కొన్ని రోజులుగా ఏపీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వస్తున్న వార్తల నేపథ్యంలో మంత్రి పేర్నినాని కీలక వ్యాఖ్యలు చేశారు. రవాణా […]
పోలీసు అధికారులపై విరుచుకుపడుతున్న రాజకీయ నాయకుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. మరీ ముఖ్యంగా ఏపీలో ఇలాంటి సంఘటనలు ఎక్కువవుతున్నాయి. గతంలో నందిగాం సురేష్, సీదిరి అప్పలరాజు వంటి నేతలు పోలీసులపై చిందులు తొక్కగా తాజాగా ఆ జాబితాఆలోకి మంత్రి పేర్ని నాని చేరారు. తమాషాలు చేస్తున్నారా.. మర్యాదగా ఉండదు అంటూ పోలీసులపై రెచ్చిపోయారు. ఆ వివారాలు.. పోలవరం పనులను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కలిసి సీఎం జగన్ పోలవరంలో పర్యటించారు. కేంద్రమంత్రి, […]
అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా సినిమా టిక్కెట్ల వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. కొంత మందిని దృష్టిలో పెట్టుకుని జగన్ సర్కార్ పనిగట్టుకుని కక్ష్య సాధిస్తోందని, అందులో భాగంగానే సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించడం, బెనిఫిట్ షోలు రద్దు చేయడం వంటి చర్యలకు పాల్పడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలోని సినీ ప్రముఖుల బృందం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యింది. ఆ సమావేశంలో సినిమా టికెట్ ధరలు, […]
సింగర్ పార్వతి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మారుమూల పల్లెలో జన్మించిన పార్వతి.. ఓ ప్రముఖ చానెల్ నిర్వహిస్తోన్న పాటల పోటీలో పాల్గొన్నది. కోకిల కన్నా మధురంగా ఉన్న ఆమె గాత్రానికి జడ్జీలు ఫిదా అయ్యారు. ఈ క్రమంలో ఏం కావాలో కోరుకో అంటే.. తన ఊరికి బస్సు లేదని.. దాని వల్ల తాను ఎలాంటి ఇబ్బందులు పడిందో వివరించిన పార్వతి.. తన ఊరికి బస్సు వచ్చేలా చూడమని కోరింది. ఈ విషయం […]
ఏపీలో సినిమా టికెట్ల ధరల వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఇండస్ట్రీ పెద్దలతో భేటీ అయ్యింది. పలు దఫాల చర్చల అనంతరం ఫిబ్రవరి 24న జీఓ విడుదల కావాల్సి ఉంది. అయితే మంత్రి గౌతమ్ రెడ్డి మృతితో జీఓ విడుదల ఆలస్యం అయ్యింది. ఫిబ్రవరి 25న పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమా విడుదల అయ్యింది. అయితే పవన్ మీద కక్షతోనే సినిమా విడుదలకు ముందు రోజు […]