తెలుగు రాష్ట్రాల్లో ఎండంలు మండిపోతున్నాయి. మొన్నటి వరకు వర్షాలు పడి కాస్త వాతావరణం చల్లబడినా.. మళ్లీ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రీలో రెండో వారానికి ఎండలు విపరీతంగా పెరిగితే.. ఇక మే నెలలో పరిస్థితి ఏంటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఎండలు నమోదు అవుతున్నాయి.
మొన్నటి వరకు వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడి ఉపశమనం కలిగినా.. మళ్లీ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు మళ్లీ మొదలయ్యాయి. ఏప్రిలో నెలలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మొన్నటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎండవేడి తీవ్రమైంది. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు మరింత పెరిగిపోయే అవకాశం ఉందని వాతావరణం నిపుణులు అంటున్నారు. ఇక సూర్యుడి నుంచి వెలువడే వేడి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. వేసవి తాపం తట్టుకోలేక శీతలపానియాల వైపు పరుగులు పెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఎండలు నమోదు అవుతున్నాయి.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రీల్ మొదటి వారం నుంచి అకస్మాత్తుగా ఉష్ణోగ్రత పెరిగిపోయింది. ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోయే అవకాశం ఉందని ఈ విషయాన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకోని ప్రజలు జాత్రగ్తగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో వేడి గాలుల ప్రభావం ఉండవొచ్చని భారత వాతావరణ శాఖ అంచనాలు వేసినట్లు సోమవారం తెలిపింది. గరిష్ష ఉష్ణోగ్రత 44 డిగ్రీల వరకు చేరుకోవచ్చని సంస్థ ఎండీ అంబేద్కర్ తెలిపారు. ఏపీలో నిన్న అత్యధికంగా 42.6 డిగ్రీలు, నెల్లమర్లలో 41.9 డిగ్రీలు, కర్నూల్ లో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మంగళవారం పలు చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటకు రావాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్నూల్ జిల్లాలో ఎండ వేడికి గోనెగండ్లలో ఓ పెద్ద బండరాయి పగిలిపోయింది. దీంతో చుట్టు పక్కల ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు.
ఇదిలా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా మొన్నటి వరకు వర్షాలు దంచికొట్టాయి. దీంతో వాతావరణం కాస్త చల్లబడింది అనుకుంటున్న లోపే మల్లీ ఎండలు మొదలయ్యాయి. మరో వారంలో తెలంగాణలో ఎండలు తీవ్రంగా పెరిగిపోతాయని, విపరీతమైన వేడి గాలులు వీయడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ నివేదిక పేర్కొంటున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాలో ఎండలు తీవ్రంగ పెరిగిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. గత వారం రోజుల క్రితం హైదరాబాద్ లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటిపోయింది.. ఈ మద్య కురిసిన వర్షాలుకు ఉష్ణోగ్రత తగ్గినప్పటికీ.. మళ్లీ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఆదివారం రాష్ట్రంలోని 14 జిల్లాలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. నల్లగొండ జిల్లా ఘన్ పూర్ లో అత్యధికంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లూపూర్ లో 42.7 డిగ్రీలు. ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లిో 42.5 డిగ్రీలు, గద్వాల్ జిల్లా ఆలంపూర్ లో 42.4 డిగ్రీలు, భూపాల పల్లి జిల్లా మహదేవ్ పూరలో 42.4 డిగ్రీలు చొప్పన నమోదు అయినట్లు ఐఎండీ వెల్లడించింది.
ఎండలు మండిపోతున్న కారణంగా ప్రజలు చాలా జాగ్రత్తలు వహించాలని.. ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటేనే బయటకు వెళ్లాలని, ఆ సమయంలో ఎండభారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలిన ఐఎండీ సూచించింది. ప్రజలు వడదెబ్బ భారిన పడకుండా నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలని.. కొబ్బరి బొండాలు, ఫ్రూట్ జ్యూస్, మజ్జిగ లాంటివి తాగుతూ ఉండాలని చెబుతున్నారు. ఇంట్లో అధిక వేడి ఉన్నట్లయితే.. చల్లగా ఉంచుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని చెబుతున్నారు.