ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయతిస్తున్న వారికి శుభవార్త. టెన్త్ అర్హతతో భారీగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. రూ.వేలల్లో జీతం అందుకునే ఛాన్స్. మరిన్ని వివరాలు మీ కోసం..
నిరుద్యోగులకు శుభవార్త. సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్‌లో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజైంది. మొత్తం 9,212 కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్) పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు. ఈ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులు మార్చి 27వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవచ్చునని సీఆర్‌పీఎఫ్ డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని సీఆర్పీఎఫ్ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 25వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన క్యాండిడేట్లు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
పరీక్ష విధానాన్ని చూసుకుంటే.. 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. 2 గంటల పాటు ఈ ఎగ్జామ్ ఉంటుుంది. జనరల్ ఇంటెలిజెన్స్/రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్/ జనరల్ అవేర్‌నెస్ నుంచి 25 ప్రశ్నలకు 25 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు, ఇంగ్లీష్/హిందీకి కూడా 25 ప్రశ్నలకు 25 చొప్పున మార్కులు ఉంటాయి. మరి.. టెన్త్ అర్హతతో జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.