వంటింట్లో ఏ వస్తువు ఉన్నా లేకున్నా. వంట నూనె ఉండాల్సిందే. ఇది లేకుంటే మహిళలకు ఏ పనీ తోచదు. నూనె సమపాళ్లల్లో వేయకపోతే కూర కూడా రుచిగా ఉండదు. నెల వారీ సరుకుల్లో కూడా నూనెకు ప్రాధాన్యత ఉంటుంది. అందుకే వీటి ధరలపై కూడా ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం వీటి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఉదయం దోసెలు, సాయంత్రం వేడి వేడి బజ్జీలు, పకోడీ తినాలన్నా, ఎటువంటి పిండి వంటలు చేసుకోవాలన్నా, చివరికీ పోపు పెట్టాలన్న కావాల్సిందీ వంట నూనె. ఎంత పొదుపు చేద్దామన్నాకాని పని. అసలు వంటింట్లో ఏదీ లేకపోయినా పని జరుగుతుందేమో కానీ, నూనెలేందో వంట అవ్వడం కష్టం. నెల వారీ సరుకుల్లో కూడా నూనెకు ప్రాధాన్యత ఉంటుంది. అందుకే వీటి ధరలపై కూడా ఆసక్తి చూపుతుంటారు సామాన్యులు. ఇటు పేపర్‌లో రేటు పెరిగిందని కనిపిస్తే చాలు.. ఏమేవ్ కూరలో నూనె తగ్గించు అంటూ భర్త అరుపులు వినిపిస్తాయ్. తగ్గిందన్నా కూడా వారి నుండి పిలుపు అందుకోవాల్సిందే.
అయితే సామాన్యులకు షాక్ నిస్తూ వంట నూనె ధర పెరిగింది. వేరు శనగ, పామాయిల్ ధరలు మళ్లీ పెరిగాయి. వేరు శనగ నూనె ధర లీటరుకు రూ. 15 నుండి రూ.20 వరకు పెరిగింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఈ స్థాయిలో ధరలు పెరగడం గమనార్హం. ఈ ఆదివారం నాటికి లీటర్ వేరు శనగ నూనె రూ. 180కి చేరుకుంది. పామాయిల్ ధర కూడా ఎగబాకింది. లీటర్ పై రూ. 3 నుండి రూ. 5 వరకు పెరిగి రూ. 104కి చేరువైంది. పొద్దు తిరుగుడు నూనె లీటరుకు రూ.135ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. దేశీయంగా నూనె గింజల పంటల ఉత్పత్తి తగ్గడం, విదేశాల్లో వేరు శనగ నూనెకు డిమాండ్ పెరగడమే కారణమని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
చైనాలో వేరు శనగ నూనె వాడకం పెరిగింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం చైనా, భారత్ నుండి ఎక్కువగా వేరు శనగ నూనెను దిగుమతి చేసుకుంటోంది. అటు ఇండోనేషియా సైతం ఎగుమతులపై ఆంక్షలు విధించడం కూడా ఓ కారణంగా కనబడుతోంది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 104 లక్షల టన్నుల వేరు శనగ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోగా.. 100 లక్షల టన్నులే వస్తుందని ఈ నెల 14న విడుదలైన రెండో ముందస్తు అంచనాల్లో వెల్లడైంది. దేశంలో 9 రకాల నూనెగింజల పంటలు కలిపి 423 లక్షల టన్నులను లక్ష్యంగా నిర్ణయించగా, రెండో ముందస్తు అంచనాల ప్రకారం 400 లక్షల టన్నుల మేర వస్తుందని గుర్తించారు.
వేరు శనగ సాగు, ఉత్పత్తిలో గుజరాత్ అగ్ర స్థానంలో ఉండగా, ఆ తర్వాత రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్రపదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. మొత్తం ఉత్పత్తిలో 45 శాతం పంట గుజరాత్ లోనే పండుతోంది. ఇక్కడ గోండల్ ప్రాంతంలో వందకు పకైగా నూనె తయారీ పరిశ్రమలు ఉన్నాయి. అయితే ఇటీవల వేరు శనగ పంట ఉత్పత్తి తగ్గినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఆయిల్‌ఫెడ్ కూడా అక్కడి నుంచే నూనెను దిగుమతి చేసుకుని విజయ బ్రాండ్ పేరుతో విక్రయిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో క్వింటాల్ కు రూ.7,400 నుంచి రూ.8,400 వర ధర పలుకుతోంది. నూనె ధరలు పెరగడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.