ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ తర్వాత తాను ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో ఉన్న అన్ని హామాలను నెరవేరుస్తూ వస్తున్నారు. నవరత్నాల్లో భాగంగా ఆయన ఇచ్చిన మాట విషయంలో మాట తప్పను.. మడమ తిప్పను అంంటూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో లబ్దిదారులు సీఎం జగన్ కి బాసటగా నిలుస్తున్నారు.. అన్న మాట నిలబెట్టుకుంటున్న సీఎం జగన్ కి జై అంటున్నారు.
ఏపిలో ఇప్పటికే జరిగిన పలు ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఏపిలో పరిషత్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఫలితాల అనంతరం సీఎం జగన్ ట్విటర్ వేదికగా ఒక వీడియో సందేశాన్ని పంపారు. ‘దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఈ అఖండ విజయం సాధ్యమైంది. మీరు చూపించిన ఈ ప్రేమాభిమానాలు నా బాధ్యతను మరింత పెంచాయి. సోమవారం ఉదయంలోపు ఎంపీటీసీ, జడ్పీటీసీల పూర్తి ఫలితాలు వస్తాయి. సోమవారం మరోసారి మీ అందరికీ వీడియో సందేశం ద్వారా ధన్యవాదాలు తెలుపుకొంటాను’’ అన్నారు.
కాగా, సీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన చేస్తున్న మంచి పనులకు ప్రజలు ఎంతో సంతోష పడుతున్నారని.. ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్ ని దీవిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా వైసీపీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
దేవుడి దయ, మీ అందరి చల్లనిదీవెనల వల్లే ఈ అఖండ విజయం సాధ్యమైంది! మీరు చూపించిన ఈ ప్రేమాభిమానాలు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం పట్ల, ప్రతి మనిషిపట్ల నా బాధ్యతను మరింత పెంచాయి. 1/2
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 19, 2021
