దేశంలో ఎంతో ప్రసిద్ది పొందిన ఆలయాల్లో ఒకటి ఒంటిమిట్టలో శ్రీకోదండరాముడి ఆలయం. రెండో భద్రాద్రిగా పేరు తెచ్చుకున్న ఒంటిమిట్టలో శ్రీకోదండరాముడి ఆలయంలో శ్రీరామ నవమి ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు. తాజాగా ఒంటిమిట్టలో శ్రీకోదండరాముడి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాత్రి ఆలయంలో స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ సాంప్రదాయ పద్దతిలో వచ్చారు. పట్టు పంచె కట్టి.. తలపాక చుట్టి పళ్లంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఊరేగింపుగా తీసుకు వచ్చారు. స్వామి వారి దర్శనం తర్వాత వేద పండితులు ఆయనను ఆశీర్వదించారు. ముఖ్యమంత్రికి టీటీడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలు, ఒంటిమిట్ట రాములవారి చిత్రపటం అందజేశారు.