ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా పీఆర్సీ రగడ కొనసాగుతోంది. ఉద్యోగులు, ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తున్నారు. పీఆర్సీని వ్యతిరేఖిస్తూ నిరసనలు తెలియజేస్తున్నారు. అంతే కాదు తమ డిమాండ్లకు నెరవేర్చకపోతే.. ఈనెల 7 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఉద్యోగులను బుజ్జగించేందుకు ప్రభుత్వం మంత్రులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉద్యోగులను చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈరోజు మంత్రుల కమిటీతో.. పీఆర్సీ స్టీరింగ్ కమిటీ భేటీ అయింది.
ఇక ఉద్యోగ సంఘాల సమ్మెకు.. ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక మద్దతు ప్రకటించింది. పీఆర్సీ సాధన సమితితో కలిసి పోరాడాలని, 2022, జనవరి 29వ తేదీ శనివారం నుంచి నిరసన దీక్షల్లో పాల్గొనాలని డిసైడ్ అయ్యింది. పీఆర్సీ సాధన సమితి ప్రకటించినట్లుగా.. ఫిబ్రవరి 07వ తేదీ నుంచి సమ్మెలో పాల్గొంటామని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులు కూడా తమ డిమాండ్ల పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తడి చేస్తున్నారు.
ఇది చదవండి: ఎత్తుకెళ్లిన దేవుడి విగ్రహాలు తిరిగి వెనక్కి ఇచ్చిన దొంగలు!
ఇదిలా ఉంటే తమ సమస్యలను పరిష్కరించకుంటే ఈనెల 6 నుంచి సమ్మెలోకి వెళ్తామని ఆర్టీసీ సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. ఈమేరకు 45 సమస్యలతో కూడిన మెమోరాండాన్ని ఆర్టీసీ ఎండీకి కార్మిక సంఘాల నేతలు అందించారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కార్మిక సంఘాల నేతలు అధికారులను కోరారు. ఇక మెమోరాండం ఇచ్చిన ఆర్టీసీ ఉద్యోగ సంఘాల్లో ఎన్ఎంయూ, ఈయూ, ఎస్ డబ్య్లూ ఎఫ్, కార్మిక పరిషత్ ఉన్నాయి.