ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా పీఆర్సీ రగడ కొనసాగుతోంది. ఉద్యోగులు, ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తున్నారు. పీఆర్సీని వ్యతిరేఖిస్తూ నిరసనలు తెలియజేస్తున్నారు. అంతే కాదు తమ డిమాండ్లకు నెరవేర్చకపోతే.. ఈనెల 7 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఉద్యోగులను బుజ్జగించేందుకు ప్రభుత్వం మంత్రులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉద్యోగులను చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈరోజు మంత్రుల కమిటీతో.. పీఆర్సీ స్టీరింగ్ కమిటీ భేటీ అయింది. […]