ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. అధికార, ప్రతిపక్షల మధ్య నిత్యం మాటల యుద్ధం కొనసాగుతుంది. అంతేకాక ఇటీవల కొంతకాలం నుంచి జనసేన సైతం దూకుడు పెంచి.. అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తుంది. ప్రస్తుత ఏపీ రాజకీయాలను పరిశీలించినట్లయితే ప్రతిపక్ష పార్టీ టీడీపీ కంటే జనసేన.. అధికార వైసీపీపై విరుచుకపడుతుంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ కి ప్రభుత్వంలోని కొందరు మంత్రులకు మధ్య మాటల యుద్ధం కొనసాగుంతుంది. మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని వంటి వాళ్లు పవన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మరోసారి మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు.
బుధవారం సత్తెనపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. తనపై విమర్శలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అంబటి రాంబాబు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. రెండు చోట్ల పోటి చేసి.. ఒక్క చోట కూడా గెలవని పవన్ తనపై ఆరోపణలు చేస్తున్నాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంకా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..” పవన్ ను నేను విమర్శించినంత ఘాటుగా వైసీపీలో ఎవరు విమర్శించరు. అందుకే నాపై ఆరోపణలు చేస్తున్నారు. సత్తెనపల్లికి వచ్చిన పవన్ కల్యాణ్.. నేను శవాల మీద పేలాలు ఏరుకునే వ్యక్తిని అని అంటారు. నా జీవితంలో ఎప్పుడు పరాయి వారి సోమ్ముకోసం ఆశపడలేదు.
నన్ను కాపుల గుండెలో కుంపటి అంటాడూ.. జగన్ మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వనంటాడు. ముందు నువ్వు గెలిచి.. చూపించవయ్యా పవన్. నేను నిజాయితీగా ఉండే వ్యక్తినే తప్పా.. మాట మాట్లాడితే పార్టీలు మార్చే వాడిని కాదు. మాట్లాడితే వాడి దగ్గరికి, వీడి దగ్గరికి వెళ్లే వ్యక్తిని కాదు. రాజశేఖర్ రెడ్డి నమ్ముకున్నాను, ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డిని నమ్ముకున్నాను. వారితోనే నా రాజకీయ జీవితం అంతం తప్పా.. అటు ఇటు కుప్పి గంతులు వేసే వ్యక్తిని కాదు. వైసీపీని అధికారంలోకి రానివ్వను, ఓట్లు చీలనివ్వనంటున్న పవన్ అంత పెద్ద మగాడా?. నీకు ఉంది.. అమాయకులైన మా కాపులేగా.. వారిని తీసుకెళ్లి చంద్రబాబు దొడ్లో కట్టేదామనేది నీ ఆలోచన. అది జరగని పని పవన్ కల్యాణ్” అంటూ మంత్రి రాంబాబు నిప్పులు చేరిగారు.
ఇదే సమయంలో కాపులకు కూడా మంత్రి అంబటి రాంబాబు చురకలు అంటించారు. మా పవన్.. మా పవన్ అంటూ గోక్కుంటున్న కాపులంతా పవన్ కల్యాణ్ తో కలిసి చంద్రబాబుకు ఊడిగం చేయండని అన్నారు. అంతేకాక కాపులు జగన్ తో ఉంటారో చంద్రబాబుకు ఊడిగం చేస్తారో తేల్చుకోవాలని అంబటి చెప్పారు. చంద్రబాబు దగ్గరకి వెళ్లి ఆయన కోసం ఊడిగ చేయాలని నిర్ణయించుకున్న పవన్ వైపు ఉంటారో.. లేక కాపులకు మేలు చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి వైపు ఉంటారో కాపులు తేల్చుకోండని అన్నారు. అలానే కాపులు ఏది తేల్చుకున్న నాకేమి అభ్యంతరం లేదని రాంబాబు తెలిపారు. మరి.. అంబటి రాంబాబు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.