వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడానికి వచ్చే 25 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. వైఎస్సార్ 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి తాజాగా, విద్యుత్ సరఫరాపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్‌ను యూనిట్‌కు 2.49 రూపాయలకే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం మూడు విడతల్లో సెకీ విద్యుత్ సరఫరా చేస్తుంది. అక్వా కల్చర్‌కు సబ్సిడీ ధరపై కరెంట్‌ను సరఫరా చేసేందుకు రైతు భరోసా వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది’’ అని అన్నారు.
అంతకు క్రితం చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ సారి కుప్పంలో చంద్రబాబుకు డిపాజిట్ రావడం కూడా కష్టమేనని అన్నారు. బాబు మానసిక పరిస్థితి ఎలా ఉందో రాష్ట్ర ప్రజలంతా చూస్తూనే ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఒకసారి వైద్యులను కలిసి చూపించుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుందో తాను చూపిస్తానన్నారు. టీడీపీ జెండాను మోయమని దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు అజెండా అప్పగించాడంటూ విమర్శలు గుప్పించారు. తాను ప్రజల కోసం పనిచేస్తుంటే.. చంద్రబాబు సొంత మనుషుల కోసం పనిచేస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికలలో కుప్పంలో చంద్రబాబు జెండాను పీకేస్తామని అన్నారు.