ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటకే ప్రజలకు ఎన్నో శుభవార్తలు చెప్పింది. తాజాగా ప్రజలకు మరో శుభవార్తను తీసుకొచ్చింది. ఆస్తి పన్ను, ఖాళీ స్థలాలకు సంబంధించి ప్రజలకు సువర్ణ అవకాశాన్ని కల్పిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వరుస శుభవార్తలు చెబుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రజలకు జగన్ సర్కార్ మరో శుభవార్తను తీసుకొచ్చింది. ఏపీలో ఆస్తి పన్నుకు సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తిపన్నుపై వడ్డీ మాఫీకి ప్రజలకు ఒక అవకాశం కల్పించారు. ప్రభుత్వం చెప్పిన విధంగా ఆస్తిపన్ను బకాయిలు చెల్లించిన వారికి ఆస్తిపన్నుపై వడ్డీ మాఫీ చేస్తామని ప్రకటించింది.
పెద్దఎత్తున పెండింగ్ లో ఉన్న ఆస్తి పన్నుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆస్తి పన్నుపై ఉన్న వడ్డీని వన్ టైమ్ మెజర్ కింద మాఫీ చేస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
పట్టణాల్లో ఉండే ప్రజలు ఆస్తి పన్ను, ఖాళీ స్థలాలపై పెండింగ్ లో ఉన్న పన్ను మొత్తాన్ని ఈ నెలాఖరులోగా చెల్లిస్తే.. వడ్డీని మాఫీ చేస్తామని ప్రకటించింది. ఈ అవకాశాన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఉండే ప్రజలు సద్వినియోగం చేసుకోవాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాది మొత్తం రూ.12,309 కోట్లు వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 2021-22లో రూ.7,941 కోట్లు వసూలు చేసిన అధికారులు.. గతేడాది రూ.9,282 కోట్లు వసూలు చేశారు. ఈ ఏడాది మొత్తం రూ.12,309 కోట్ల వరకు వసూలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.