మాదక ద్రవ్యాల వాడకం వలన చాలామంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎంతో మంది వయస్సుతో సంబంధం లేకుండా వీటికి బానిసలవుతున్నారు. ఇలా గంజాయి తీసుకున్న వారు బాహ్య ప్రపంచాన్ని మరచి ప్రవర్తిస్తుంటారు. తాజాగా గంజాయి తీసుకున్న అఘోరాలు అఖండ సినిమా చూడటానికి వచ్చి రోడ్లపై తిరుగుతూ అందరిని భయాందోళనకు గురిచేశారు. ఈ ఘటన విశాఖపట్నంలో జరిగింది. అఘోరాలు రోడ్లపై బీభత్సం చేసిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోన్నాయి.
విశాఖపట్నంలోని నర్సీపట్నం టౌన్ రోడ్లపై అఘోరాలు తిరుగుతూ వీరంగం చేశారు. గంజాయి సేవించిన వారు నర్నీపట్నంలోని కృష్ణ బజార్ సెంటర్ లో అటుగా వెళ్తున్న వాహనాలను ఆపుతూ రచ్చ చేశారు. అఘోరాలు చేసిన రచ్చకు వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. వాహనాలను ఆపి వారి ముందు గట్టిగా కేకలు వేస్తూ అటు ఇటు రోడ్లపై తిరుగుతున్నారు. అఖండ సినిమా చూసేందుకు వచ్చిన వీరు.. సినిమా అయిపోయాక రోడ్లపై వాహనాలను ఆపుతున్నారని స్థానికులు ఆరోపించారు. థియేటర్లో ఉన్న సమయంలో కూడా వీరు గంజాయి మత్తులో ఉన్నారని స్థానికులు తెలిపారు. వీరి బీభత్సంతో కొద్ది సమయం పాటు ఆ ప్రాంతమంతా వాహనాలు నిలిచిపోయి రద్దీగా మారింది. ఇంతలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అఘోరాలు అక్కడి నుంచి పరారయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరి..ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.