ప్రముఖ చారిత్రక నవలా రచయిత, ‘చారిత్రక నవలా చక్రవర్తి’గా ఖ్యాతి గడించిన ముదిగొండ శివప్రసాద్ కన్నుమూశారు. గత ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గురువారం రాత్రి గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 8:45 గంటల సమయంలో మరోసారి గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో 1940 డిసెంబర్ 23న జన్మించారు ముదిగొండ శివప్రసాద్. పుట్టింది ఆంధ్రాలో […]