ప్రపంచంలో వింతైన అలవాట్లు, రూపాలతో అందరి దృష్టిని ఆకర్షించే వారు ఎందరో ఉంటారు. సరిగ్గా ఇలాంటి కోవలోకే వస్తారు అమెరికాకు చెందిన 54 ఏళ్ల మాథ్యూ హే. తన అసాధారణమైన గడ్డంతో ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన సహజ గడ్డం జడ కలిగిన వ్యక్తిగా ఆయన రికార్డు పుటల్లోకి ఎక్కారు. అమెరికాలోని కాన్సాస్కు చెందిన మాథ్యూ హే గడ్డం పొడవు ఏకంగా 5 అడుగుల 3 అంగుళాలు ఉండటం విశేషం. […]