టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా రివ్యూ ఎలా ఉంది, ప్రేక్షకులు ఏమంటున్నారు, రేటింగ్ ఎంత ఇస్తున్నారో తెలుసుకుందాం.
యశ్‌రాజ్ ఫిల్మ్ యూనివర్శిటీ నుంచి వచ్చిన ఈ సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్. సినిమాలో హీరోల ఎంట్రీ సీన్స్, ఇద్దరు హీరోల డ్యాన్స్, హైలైట్‌గా నిలిచాయంటున్నారు. కియారా అద్వానీ గ్లామర్, ఇతర బాలీవుడ్ హీరోల గెస్ట్ అప్పీరెన్స్ ప్రేక్షకుడిని అలరించాయి. ఇక లీడ్ రోల్ పోషించిన ఇద్దరు హీరోల పర్ఫార్మెన్స్ ఓ రేంజ్‌లో ఉంంటున్నారు. ఇప్పటి వరకు వచ్చిన స్పై సినిమాల కధకు ఇది భిన్నంగా ఉంది.
దర్శకుడిగా అయాన్ ముఖరీకు మార్కులైతే పడ్డాయి గానీ గ్రాఫిక్స్ విషయంలో తేలిపోయినట్టు విమర్శలు వస్తున్నాయి. ఇద్దరు హీరోల్ని దర్శకుడు అద్భుతంగా చూపించే ప్రయత్నం చేశాడు. సినిమా ఫస్ట్ హాఫ్ అద్భుతంగా సాగినా సెకండ్ హాఫ్ అంతగా ఆకట్టుకోలేకపోయిందంటున్నారు. సినిమాలో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో ట్విస్టులు బాగున్నాయి. సంగీతం విషయంలో ప్రీతమ్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎఫెక్టివ్‌గా లేదు.
నటీనటుల్లో తారక్, హృతిక్ రోషన్ ఇద్దరూ పోటీ పడి నటించారు. ఇద్దరూ కలిసి అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్‌ని ఆకట్టుకున్నారు. కియారాను అందంగానే కాకుండా హాట్‌గా చూపించడంతో ప్రేక్షకులు ఆనందపడ్డారు. కొన్ని సన్నివేశాలు ల్యాగ్‌గా ఉండి ఎడిటింగ్ అవసరమన్పించింది.
ప్లస్ పాయింట్లు
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటన, ఇంటర్వెల్ సీన్, ఫస్టాఫ్, కియారా అద్వానీ అందం
మైనస్ పాయింట్లు
సెకండాఫ్ సీన్లు, సంగీతం, గ్రాఫిక్స్
రేటింగ్: 3/5
Note: ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే