SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » reviews » Ravanasura Movie Telugu Review Rating

రావణాసుర మూవీ రివ్యూ!

మాస్ మహరాజ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రావణాసుర సినిమా థియేటర్లలోకి రానే వచ్చింది. ట్రైలర్ చూసిన తర్వాత ప్రేక్షకులు ఈ సినిమా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. మరి.. ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా? లేదా? ఈ రవ్యూలో తెలుసుకోండి.

    Updated On - Mon - 17 April 23
    • facebook
    • twitter
    • |
        Follow Us
      • Suman TV Google News

రావణాసుర

07-04-2023, క్రైమ్ థ్రిల్లర్, 2h 22m U/A
థియేటర్స్ లో
  • నటినటులు:రవితేజ, సుశాంత్, జయరాం, రావు రమేశ్, శ్రీరామ్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్, అను ఇమ్మాన్యుఏల్ తదితరులు
  • దర్శకత్వం:సుధీర్ వర్మ
  • నిర్మాత:అభిషేక్ నామా, రవితేజ
  • సంగీతం:హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ సెసిరోలియో
  • సినిమాటోగ్రఫీ:విజయ్ కార్తిక్ కన్నన్

Rating

3/5

మాస్‌ మహరాజ్‌ రవితేజ.. ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకుల్లో ఫుల్‌ జోష్‌ వచ్చేస్తుంది. రవితేజ సినిమా థియేటర్లో విడుదల అవుతోంది అనగానే భారీ అంచనాలు ఏర్పడతాయి. వయసుతో సంబంధం లేకుండా అందరూ సినిమాకి క్యూ కడతారు. అలాంటి మాస్‌ మహరాజ్‌ నటించిన రావణాసుర సినిమా వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 7న విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమా పాటలు, ట్రైలర్‌ చూసిన దగ్గరి నుంచి మంచి బజ్‌ ఏర్పడింది. ఎప్పుడెప్పుడు ఆ సినిమా చూడాలా అని ప్రేక్షకుల్లో ఒక కుతూహలం మొదలైంది. మరి ఆ సినిమా ఎలా ఉంది? రవితేజ ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను రీచ్ అయ్యాడా? రవితేజ ఖాతాలో మరో హిట్టు పడిందా? లేదా? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ రివ్యూలో తెలుసుకోండి.

కథ:

రవీంద్ర(రవితేజ) ఒక క్రిమినల్‌ లాయర్‌. వెంకటలక్ష్మి(ఫరియా అబ్దుల్లా) అనే సీనియర్‌ లాయర్‌ దగ్గర జూనియర్‌ గా ప్రాక్టీస్ చేస్తుంటాడు. అతనికి బాబ్జీ(హైపర్ ఆది) అనే జూనియర్ ఉంటాడు. రవీంద్రకి మంచానికి పరిమితమై.. ఆస్పత్రిలో చికిత్స పొందే తండ్రి కూడా ఉంటాడు. ఎలాగోలా ఒకర్ని పడేసి వెంటనే పెళ్లి చేసుకోవాలి అనే ధోరణిలో ఉండే రవీంద్ర లైఫ్‌ సడన్‌ టర్న్ తీసుకుంటుంది. కథలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఆ హత్య కేసులు మొత్తం వెంకటలక్ష్మి దగ్గరకే వస్తుంటాయి. అసలు ఆ హత్యలు ఎవరు చేశారు? వాటి వల్ల రవితేజ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అయ్యింది? రవితేజ అంత నెగెటివ్ గా ఎందుకు మారాడు? ఆ హత్యలు చేసింది ఎవరు? అందుకు గల అసలు కారణం ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మీరు రావణాసుర సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ఇది ఒక సర్వ సాధారణ రివేంజ్‌ స్టోరీ. మీకు ఈ కథ మొత్తం ఎప్పుడో చూసిన, ఎక్కడో విన్న కామన్‌ కథలాగానే అనిపించవచ్చు. కానీ, సుధీర్ వర్మ కథను ఎంతో కొత్తగా చెప్పాడు. మీకోసం ట్విస్టులు, షాకులు బాగానే ప్లాన్ చేసుకున్నాడు. సాధారణంగా సుధీర్ వర్మ సినిమా అనగానే ఎన్నో కొన్ని ఆశలు పెట్టుకుని థియేటర్ కి వెళ్తారు. ఆ క్యురియాసిటీని మాత్రం తగ్గించలేదనే చెప్పాలి. లా చదివి సరదాగా లైఫ్ లీడ్ చేస్తున్న రవితేజ జీవితంలో తీసుకునే మలుపులు మెప్పిస్తాయి. రవితేజను ఇంత వైలెంట్ గా, ఇంత నెగెటివ్‌ షేడ్‌ లో మీరు ఎప్పుడూ చూసుండరు. మీకు సినిమా చూస్తున్నంతసేపు రవితేజ హీరోనా? విలనా? మంచోడా? చెడ్డోడా? ఈ ప్రశ్నలు మీ బుర్రలో తిరుగతూనే ఉంటాయి. ఈ సినిమాలో ఎంతో పెద్ద తారాగణం ఉంది. కానీ, ఏ ఒక్క పాత్ర కూడా అనవసరంగా ఉంది అనే ఫీలింగ్ రాదు. కథ నడిచినంత సేపు నెక్ట్స్‌ ఏం జరగబోతోంది? అనే ఒక ఆసక్తిని మీకు కలిగిస్తాడు.

raviteja ravanasura movie review and rating in telugu (4)

ఈ కథలో ఉన్న మెయిన్ ట్విస్ట్ ని మాత్రం రివీల్ చేయకుండా.. దాదాపు 2 గంటలు మెయిన్ టైన్‌ చేయగలిగాడు. అసలు ట్విస్ట్ తెలిసిన తర్వాత కథ మామూలేగా అనుకుంటారు. కానీ, చివరి వరకు ప్రేక్షకుల కోసం సుధీర్ వర్మ ఏదొక ట్విస్టు ఇస్తూనే వచ్చాడు. ఈ సినిమాలో క్రైమ్‌, థ్రిల్లర్‌ మాత్రమే కాదండోయ్‌ కామెడీని కూడా బాగానే ప్లాన్ చేశాడు. హైపర్ ఆదీ ఉన్నంతసేపు మీకు నవ్వు ఆగదు. రవితేజ  ఇన్వాల్స్ అయిన తర్వాత కథ మొత్తం పరగులు పెడుతుంది. ఒక్క ఆధారం లేకుండా అన్ని హత్యలు ఎలా చేయగలిగారు? పోలీసులకే ఛాలెంజ్ చేసి ఎలా నెగ్గుకొచ్చారో చూపించిన తీరు చాలా కన్విన్సింగ్ గా ఉంటుంది. కొన్ని సన్నివేశాల్లో మాత్రం సుధీర్ వర్మ వైలెన్స్‌ ని కాస్త వైలెంట్ గానే చూపించాడు. ట్రైలర్‌, రవితేజ ఇమేజ్‌ ని దృష్టిలో పెట్టుకుని హోప్స్‌ పెట్టుకుని థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులను నిరాశ పరచకుండా సుధీర్ వర్మ గట్టిగానే ప్లాన్ చేశాడు.

నటీనటుల పనితీరు:

ఈ సినిమాలో రవితేజ వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. కామెడీ, విలనిజం, హీరోయిజం ఇలా అన్ని షేడ్స్‌ ఎంతో పర్ఫెక్ట్‌ గా మెయిన్ టైన్ చేశాడు. ఇంక డాన్స్ విషయానికి వస్తే.. రవితేజలో ఇంకా ఊపు తగ్గలేదు అనే డైలాగ్‌ కచ్చితంగా చెప్తారు. సుశాంత్ కు ఈ సినిమాలో చాలా మంచి పాత్ర దొరికింది. ఇందులో యాక్టింగ్ కూడా చాలా మంచి స్కోప్‌ ఉంది. ప్రతి సన్నివేశంలో సుశాంత్ ప్రేక్షకులను మెప్పించాడు. రవితేజ తర్వాత ప్రేక్షకులకు ఈ పాత్ర బాగా గుర్తుంటుంది. జయరాం ఒక పోలీస్ ఆఫీసర్‌ గా మెప్పించారు. జయరాం కేసును హ్యాండిల్ చేసే తీరు నచ్చుతుంది. మేఘా ఆకాశ్ కు ఒక మంచి పాత్రే పడింది. ఆమె కూడా ఎక్కడా నిరాశ పరచలేదు. అను ఇమ్మాన్యుయేల్ కి చాలా రోజుల తర్వాత ఒక పాత్ర దొరికింది. కానీ, అది చాలా పరిమితమైందే. ఉన్న కాసేపు ఆమె పాత్రకు న్యాయం చేసింది. ఫరియా అబ్దుల్లా, హైపర్ ఆదీ కూడా తమ పరిధికి తగ్గట్లు అలరిస్తారు. మురళీ శర్మ, రావు రమేశ్‌ లాంటి సీనియర్లు చాలామందే కనిపిస్తారు. ఆ పాత్రలు మొత్తం కథకు తగ్గట్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటాయి. దక్షా నాగర్నర్, పూజిత పొన్నాడ ఉన్నంత వరకు మెప్పిస్తారు.

టెక్నీషియన్స్:

స్క్రీన్ మీద కనిపించే హీరో రవితేజ అయితే.. ఆఫ్‌ ది స్క్రీన్ హీరో మాత్రం సుధీర్ వర్మనే చెప్పాలి. ఒక సింపుల్ రివేంజ్‌ స్టోరీని అతను తెరకెక్కించిన తీరు ఎంతో కొత్తగా అనిపిస్తుంది. ప్రతి ట్విస్టు మిమ్మల్ని వావ్ అనేలా చేస్తుంది. ఒక్కో పాయింట్ ని రివీల్ చేయడం ఆకట్టుకుంటుంది. రావణాసురిడి డైలాగులు కూడా కొన్నిచోట్ల చాలా బలంగా ఉంటాయి. ఈ సినిమాలో హర్షవర్దన్, భీమ్స్‌ ఇచ్చిన మ్యూజిక్ మెప్పిస్తుంది. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు. రావణాసుర థీమ్‌ సాంగ్‌.. సినిమా అయిపోయినా మీ మైండ్ లో తిరుగుతూ ఉంటుంది. విజయ్ కార్తీక్ కన్నన్‌ సినిమాటోగ్రఫీ మరీ కొత్తగా ఏం అనిపించదు. కానీ, మరీ నిరాశ పరచలేదు. నవీన్ నూలి ఎడిటింగ్ మొదట్లో కాస్త సాగదీతగా అనిపించినా.. ట్విస్ట్ రివీల్‌ అయిన తర్వాత మాత్రం పరుగులు పెడుతుంది. మళ్లీ సెకండాఫ్ లో కాస్త నెమ్మదించినట్లు అనిపిస్తుంది. అభిషేక్ నామా, రవితేజ నిర్మాణ విలువలను బాగా మెయిన్ టైన్ చేశారు. సినిమా మొత్తం ఎంతో రిచ్ గా ఉంటుంది.

బలాలు:

  • రవితేజ
  • కథనం
  • ట్విస్టులు
  • నటీనటులు

బలహీనతలు:

  • అక్కడక్కడా నెమ్మదిగా సాగే సీన్లు

చివరి మాట: ఈ రావణాసురుడు మీకూ నచ్చుతాడు.

రేటింగ్:

3/5

(గమనిక: ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.)

Tags :

  • megha akash
  • Raviteja
  • Sudheer Varma
  • Sushanth
  • Telugu Movie Reviews
Read Today's Latest reviewsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పోలీస్ ఆఫీసర్ VS సైకో కిల్లర్ ఒక మైండ్ గేమ్!

పోలీస్ ఆఫీసర్ VS సైకో కిల్లర్ ఒక మైండ్ గేమ్!

  • Adipurush Twitter Review: ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ ట్విట్టర్ రివ్యూ! టాక్ ఎలా ఉందంటే?

    Adipurush Twitter Review: ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ ట్విట్టర్ రివ్యూ! టాక...

  • క్రేజీ కాంబినేషన్‌.. ఆ స్టార్‌ హీరోతో ‘జాతిరత్నాలు’ డైరెక్టర్‌ సినిమా!

    క్రేజీ కాంబినేషన్‌.. ఆ స్టార్‌ హీరోతో ‘జాతిరత్నాలు’ డైరెక్టర్‌ సినిమా!

  • Ravanasura: ఏంటి సుధీర్ వర్మ.. రావణాసుర మూవీ కాపీనా?

    Ravanasura: ఏంటి సుధీర్ వర్మ.. రావణాసుర మూవీ కాపీనా?

  • Ravanasura Collection: ‘రావణాసుర’ కలెక్షన్స్ మేనియా.. తొలిరోజు అన్ని కోట్లు!

    Ravanasura Collection: ‘రావణాసుర’ కలెక్షన్స్ మేనియా.. తొలిరో...

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

తాజా వార్తలు

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన APSDMA!

  • లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి.. కానిస్టేబుల్ శ్రీను ఆత్మహత్య.. భార్య ఫొటోలతో బ్లాక్‌మెయిల్!

  • మౌళి 'DNK' ట్రైలర్ రివ్యూ: థియేటర్లలో నవ్వుల జాతర.. నవంబర్ 13న సినిమా రిలీజ్!

  • రీల్ హీరోలకు రియల్ లైఫ్‌లో టెన్షన్! బిష్ణోయ్ గ్యాంగ్ భయంతో బుల్లెట్ ప్రూఫ్ వెనుక అమితాబ్.. బాలీవుడ్‌లో హై అలర్ట్!

  • ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ఏకంగా ₹31,387 కోట్ల AI డేటా సెంటర్‌కు ఆమోదం!

  • కొత్త హీరో కోసం టాలీవుడ్ టాప్ స్టార్స్ క్యూ.. నాగ్, ఎన్టీఆర్, చరణ్ సపోర్ట్ వెనుక అసలు కథ ఇదే!

Most viewed

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • హైదరాబాద్‌లో క్యాన్సర్ మహమ్మారి.. 7 నెలల్లో 35 వేల కేసులు! ప్రభుత్వం కీలక నిర్ణయం

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam