ఢిల్లీ మెట్రో రైల్లో చంద్రముఖి వేషంలో ఓ యువతి హల్‌చల్ చేసిందంటూ గత కొద్ది రోజులుగా ఓ వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. స్థానిక మీడియా దగ్గరనుంచి నేషనల్ మీడియా వరకు అన్ని మీడియా సంస్థలు దీనిపై కథనాలు ప్రచురించాయి. అయితే, ఈ వీడియో సోషల్ మీడియా ఫేమ్ కోసం చేసింది కాదట. ఓ యాడ్ ఫిల్మ్ కోసం చేసిందట. గత కొద్దిరోజులుగా వైరల్ అవుతున్న వీడియోపై నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనిజింగ్ డైరెక్టర్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. అది ఓ యాడ్ ఫిల్మ్‌కు సంబంధించిందని ఆయన పేర్కొన్నారు. ‘బోట్’ కంపెనీ ఢిల్లీ మెట్రో రైల్లో యాడ్- ఫిలిం షూటింగ్ చిత్రీకరించిందని తెలిపారు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న కొన్ని టీవీ సిరీస్, సినిమాలకి సంబంధించిన కొన్ని పాత్రల వేషంలో ఉన్న నటులు ఈ యాడ్లో కనిపించనున్నారని వెల్లడించారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ దృశ్యాలు ‘బోట్ ఎయిర్ డోప్స్’ యాడ్ ఫిలిం షూటింగ్‌వని స్పష్టం చేశారు. కాగా, ప్రముఖ తమిళ దర్శకుడు పీ వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన సినిమా చంద్రముఖి. ఈ సినిమా రజినీకాంత్ సినిమాల్లో ఓ మైలురాయి సినిమాగా నిలిచిపోయింది. సూపర్ స్టార్ ఓ కొత్త జానర్‌లో సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. సినిమా విడుదలై దాదాపు 15 సంవత్సరాలు అవుతున్నా.. క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇక, ఈ సినిమాలోని చంద్రముఖి పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మలయాళంలో తెరకెక్కిన ‘‘మణిచిత్రతాయు’’ సినిమా ఆధారంగా ‘‘చంద్రముఖి తమిళంలో తెరకెక్కింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.