ప్రస్తుతం సోషల్ మీడియాలో థ్రో బ్యాక్ ట్రెండ్ నడుస్తోంది. ప్రతి రోజు ఏదో ఒక హీరో, హీరోయిన్ల చిన్నప్పటి ఫోటోలో లేదా గతంలో దిగిన ఫోటోలు నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. ఇవి ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. తాజాగా అటువంటి ఫోటో ఒకటి వైరల్ గా మారింది.
ప్రస్తుతం హీరో , హీరోయిన్లు ఏం చేస్తున్నారో, వాళ్ల తదుపరి సినిమా ఏంటో అన్న విషయాల గురించి అభిమానులు నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు. ఎటువంటి అప్ డేట్ న్యూస్‌లు రావట్లేదంటే.. వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల్లో వెతుకుతున్నారు. అక్కడ లేదంటే ఇన్ స్టా గ్రామ్ వంటి వాటిల్లో నేరుగా వారినే ప్రశ్నిస్తున్నారు. కొన్ని సార్లు నటీనటులే తమ విషయాలను సోషల్ మీడియా ఖాతాల ద్వారా నెటిజన్లు, అభిమానులతో పంచుకుంటున్నారు. షూటింగ్ బిజీలో ఉంటే ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వని నటులు, తీరిక దొరికిందంటే ఫోటో షూట్లతో దర్శనమిస్తారు. లేదంటే ఫేమస్ సాంగ్స్ కీ రీల్స్ చేసినవి, థ్రో బ్యాక్ పిక్చర్లను నెట్టింట్లో షేర్ చేస్తారు. అలాంటి పిక్చర్ ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఈ ఫోటోలో కనిపిస్తున్న నలుగుర్ని తీక్షణంగా చూడండి. గుర్తు పట్టారు కదా. అవునండీ మెగా, అల్లు వారసులు. ఇంతకూ ఆ నలుగురు ఎవరెవరో గుర్తు పట్టారా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆయన తమ్ముడు అల్లు శిరీష్, మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్, ఆయన కుమార్తె సుస్మిత కొణెదల. ఈ ఫోటోలను ఓ వ్యక్తి షేర్ చేయగా నెట్లింట్లో హల్ చల్ చేస్తుంది. అందులో బన్నీ, సుస్మిత క్యూట్ స్మైల్స్ తో ఫోటోలకు ఫోజులిస్తుండగా, రామ్ చరణ్ క్యూట్ లుక్స్ లో కనిపిస్తున్నారు. అల్లు శిరీష్ మాత్రం అల్లరి చేస్తూ కనిపిస్తున్నారు. ఈ నలుగురు ఒక్క చోటే దర్శనమిస్తున్న ఈ ఫోటోను చూసి అల్లు, మెగా ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.
బడా నిర్మాత అల్లు వారసుడు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు అల్లు అర్జున్. గంగోత్రితో సినిమా పరిశ్రమలోకి వచ్చిన ఆయన పుష్పతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుతతో వచ్చిన చిరు బిడ్ద రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ రేంజ్‌కు చేరారు. అల్లు శిరీష్ పలు సినిమాలతో మెప్పించారు. అయితే కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్డడంతో.. ఆశించిన రేంజ్‌ను అందుకోలేకపోయారు. ఇటు సుస్మిత వివాహం చేసుకున్నప్పటికీ.. తన తండ్రి సినిమాలకు క్యాస్టూమ్ డిజైనర్ గా మారారు. ఇప్పుడు తన భర్తతో కలిసి చిన్న నిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.