మందు బాబులకు ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది. గతంలో మద్యం తాగి దొరికితే జరిమానా విధించడం, లేదంటే జైలుకు పంపించడం వంటివి చేసేది. కానీ ఇప్పుడు అలా కాకుండా తాగుబోతు పరువు తీసేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఈ దెబ్బతో రాష్ట్రంలోని మందుబాబుల విలవిలలాడుతున్నారు. మందుబాబులకు ప్రభుత్వం ఇచ్చిన షాక్ ఏంటే? ప్రభుత్వం ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకుందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. బిహార్ ప్రభుత్వం 2016 మద్యపాన నిశేషం విధించిన విషయం తెలిసిందే.
దీంతో అప్పటి నుంచి ప్రభుత్వం రాష్ట్రంలో సంపూర్ణ మద్యపానం దిశగా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఇలా ప్రజల్లో ప్రజల్లో మార్పు కోసం ప్రభుత్వం అనేక రకాలుగా ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభించడం మొదులు పెట్టింది. అయినా మందు బాబుల తీరు మాత్రం మార్చుకోవడం లేదు. ఇలా కాదని భావించిన బిహార్ ప్రభుత్వం 2022 ఏప్రిల్ 22 నుంచి మద్యం తాగుతూ దొరికిన వాళ్లు సిగ్గుపడేలా చేస్తుంది. విషయం ఏంటంటే? రాష్ట్రంలో ఏ వ్యక్తులు అయినా మద్యం తాగి దొరికితే ఏకంగా ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి అతని ఇంటికి ఇతను తాగుబోతు అనేలా పరువు పోయే స్టిక్కర్లను అంటిస్తున్నారు.
ఇందులో భాగంగానే రాష్ట్రంలోని గోపాల్ గంజ్ జిల్లాలో ఇప్పటికీ 52 వేల తాగుబోతుల ఇండ్లకు అబ్కారీ అధికారులు స్టిక్కర్లు అంటించినట్లు తెలుస్తోంది. ఇదే అంశం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అప్పటిలా మద్యం తాగి దొరికితే జరిమానా విధించడం, జైలుకు తరలించడం ఉండదని.., ఏకంగా ఇంటికే వచ్చి మీ పరువు బజారున పడేలా చేస్తామంటూ మందుబాబులకు అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలంటే మద్యం తాగకూడదని, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా ఇదేనంటూ అధికారులు సూచిస్తున్నారు. అయితే ఇదే ఫొటోలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి.