ప్రేమికులకు ఈ లోకంతో పని ఉండదు. ప్రేమలో మునిగి తేలితే పక్కన ఎవ్వరూ ఉన్నా పట్టించుకోరు. పొద్దున్న లేచిన దగ్గర నుండి పడుకునే దాకా వారి ఆలోచనలే చేస్తారు. ఫోన్లో మాట్లాడుకుందని చాలదని.. ఎలాగైనా కలవాలన్న కుతుహలంతో ఉంటారు.
ప్రేమికులకు ఈ లోకంతో పని ఉండదు. ప్రేమలో మునిగి తేలితే పక్కన ఎవ్వరూ ఉన్నా పట్టించుకోరు. పొద్దున్న లేచిన దగ్గర నుండి పడుకునే దాకా వారి ఆలోచనలే చేస్తారు. ఫోన్లో మాట్లాడుకుందని చాలదని.. ఎలాగైనా కలవాలన్న కుతుహలంతో ఉంటారు. తల్లిదండ్రుల కళ్లుగప్పి, స్నేహితులకు మాయమాటలు చెప్పి తాము ప్రేమించిన వ్యక్తితో కొంత సమయం గడిపేందుకు వెళుతుంటారు. సినిమాలు, షికార్లు చేస్తుంటారు. వీరికి పార్కులు, ఏకాంత ప్రదేశాలే కాదు చెట్లు, పుట్టలు ఆవాసాలు. వాటి మాటున రొమాన్స్ సాగిస్తుంటారు. రోజంతా ప్రేమించుకున్నా తనివితీరని ఓ జంట.. రాత్రిళ్లు ముద్దు ముచ్చట్లతో తేలేందుకు సిద్ధమైంది. అయితే ప్రియుడ్ని కలిసేందుకు ప్రియురాలి చేసిన పని వింటే ఆశ్చర్యం వేయకమానదు. ఇంతకు ప్రియురాలు ఏం చేసిందంటే..?
కొన్ని రోజుల నుండి ఆ గ్రామంలో రాత్రుళ్లు కరెంట్ పోతుంది. అనుమానం వచ్చిన గ్రామస్థులు ఓ రోజు నిఘా పెట్టారు. తీరా చూస్తే.. ఇది ఓ మహిళ పని అని తెలిసి ఆశ్చర్యపోయడంతో పాటు ఉతికారేశారు. ఇంతకు ఎందుకు ఆమె అలా చేసిందంటే.. ప్రియుడ్ని కలిసేందుకు. వినడానికి వింతగా అనిపించిన ఈ ఘటన బీహార్‌లోని బేతియా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నౌతన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో యువతి నివసిస్తోంది. ఆమె మరో గ్రామానికి చెందిన యువకుడ్ని ప్రేమించింది. అయితే పగలు ప్రియుడ్ని కలిస్తే ఎవరైనా చూస్తారని, రాత్రి సమయంలో కలుద్దామని నిర్ణయించుకుంది. దీని కోసం ఓ మాస్టర్ ప్లాన్ వేశారు ప్రేమికులు. ఊరంతా చీకట్లు నింపి, తాము రొమాన్స్ చేయాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా ప్రేమికుడు తన వద్దకు వచ్చే రాత్రి సమయంలో ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లి కరెంట్ కట్ చేసేది. ఆ తర్వాత ఇద్దరూ రొమాన్సులో మునిగి తేలేవారు. ఊరంతా చీకట్లో గడిపేది.
అయితే ఈ కరెంట్ కట్ కారణంగా ఆ గ్రామంలో దొంగతనాలు పెరగడం ప్రారంభమయ్యాయి. దీంతో గ్రామస్థులు నిఘా మొదలు పెట్టారు. ఈ నెల 14వ తేదీన కూడా వీరిద్దరూ కరెంట్ తీసేసి, ఏకాంతంగా ఉండగా గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కొట్టారు. ఈ ఘటనను కొంత మంది వీడియో తీసి.. వైరల్ చేశారు. అతడిని కొడుతుండగా.. ఆమె అడ్డు చెప్పడం వీడియోలో కనిస్తుంది. ఈ వీడియో బయటకు రావడంతో ప్రేమికురాలి గ్రామానికి చెందిన కొంత మంది యువకులను ప్రశ్నించేందుకు వెళ్లాడు యువకుడు. ఆ సమయంలో కాస్త గొడవ జరిగింది. ఈ పంచాయతీ పోలీసులు దగ్గరకు చేరింది. కొంత మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇరు కుటుంబ సభ్యులను పిలిపించి, కౌన్సిలింగ్ ఇవ్వడంతో వారి పెళ్లికి పెద్దలు అంగీకరించారు.