సీనియర్ హీరోయిన్ కస్తూరీ శంకర్ అంటే తెలియని వారుండరేమో. తన అందం, అభినయంతో ఈ అమ్ముడు అప్పట్లో ఓ ఊపు ఊపింది. గతంలో భారతీయుడు, అన్నమయ్య వంటి సినిమాల్లో నటించి ఈ హీరోయిన్ తనకుంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను మూటగట్టుకుంది. అయితే ఈ సినిమాల తర్వాత కస్తూరి పూర్తిగా సినిమాల్లో కనిపించకుండా పోయింది. దీనికి కారణం తన వ్యక్తిగత కారణాలు ఉన్నాయంటూ అనేక సార్లు ఇంటర్వ్యుల్లో చెప్పుకుంటూ వచ్చింది. వయసు పెరిగినా తరగని అందంతో కస్తూరి కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది. అయితే ఈ హీరోయిన్ ప్రస్తుతం ఓ ప్రముఖ టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే గృహలక్ష్మి అనే సీరియల్ నటిస్తూ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇదిలా ఉంటే నటి కస్తూరి ఓ ఇంటర్యూలో కీలక విషయాలు వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో నేనంటే నచ్చని వాళ్లు చాలా మందే ఉన్నారు. వీళ్లంత పని గట్టుకుని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఓ 60 ఏళ్ల ముసలి వ్యాపారవేత్తతో ఎఫైర్ కొనసాగిస్తున్నానని, అతనితో కలిసి తిరుగుతున్నానంటూ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు విని నాకు చాలా బాధ కలిగింది. ఇండస్ట్రీలో హీరోయిన్ లపై ఇలాంటి వార్తలు రావడం సహజం. కానీ ఎందుకో నాపై వస్తున్న ఈ తప్పుడు ప్రచారాన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నానంటూ సీనియర్ నటి కస్తూరి తన బాధను చెప్పుకొచ్చింది.