ప్రముఖ వివాదాస్పద మతగురువైన నిత్యానందస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చేసిన అనేక వివాదస్పద కార్యలతో అందరి నోర్లలో నానుతున్నాడు. దైవం నేనే అన్నారు. నైవేద్యం నాకే అన్నారు. ఈ స్వాములోరి మాయాలు ఒకటి కాదు, రెండు కాదు. వైద్యుడు నేనే అన్నారు. వైద్యం నేనే అన్నారు. ఇప్పుడు అనారోగ్యంతో అవస్థలు. చికిత్స కోసం అభ్యర్ధనలు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం… ఈ వివాదస్పద స్వామి నిత్యానంద ప్రస్తుత పరిస్థితి ఇది. అన్నీ నేనే, అంతా నేనే అని తనకు తాను డబ్బు వేసుకున్న ఈ నిత్యానంద స్వాములోరి పరిస్థితి దారుణంగా ఉందంట. ఎక్కడున్నాడో తెలియదు, ఏమి చేస్తున్నాడో తెలియదు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితిపై వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
నిత్యానంద చేసిన పాడు పనులు ఇప్పుడు జీవితా చరమాంకానికి తీసుకోవచ్చా. పుట్టిన దేశం నుంచి పరారై… సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకుని కనీసం వైద్యం సదుపాయం లేక విదేశి సాయం అర్ధిస్తున్నాడు. తనకు వైద్య చికిత్స అందించింది బ్రతికించమని వేడుకుంటున్నాడట. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘేకు లేఖ రాసి.. ప్రాణాలు కాపాడమని నిత్యానంద కోరాడు. నిత్యానంద ప్రస్తుతం అత్యంత విషయమ పరిస్థితుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. తనకు ఆశ్రయం కావాలని, ఇప్పుడు తనకు వైద్యం అత్యవసరమని శ్రీలంకను వేడుకున్నాడంటా.గత నెల7 ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ‘శ్రీ కైలాసం’ పేరుతో చిన్నపాటి ద్వీపంలో సొంతంగా సామ్రాజ్యాని ఏర్పాటు చేసుకున్న నిత్యనంద.. అక్కడ వైద్య సదుపాయలు లేకపోవడంతో శ్రీలంక సాయం కోసం ప్రయత్నిస్తోన్నాడు.
వైద్యం కోసం అయ్యే అన్ని ఖర్చులను తామే భరిస్తామని, ఆపై శ్రీలంకలో పెట్టుబడులు కూడా పెడతామని హామీ ఇచ్చారట. నిత్యానంద లేఖ రాయడం నిజమేనని శ్రీలంకు చెందిన ఓ అధికారి స్పష్టం చేశారు. నిత్యానంద తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, ఆయనకి అత్యవసర చికిత్స అవసరమని తెలిపారు. శ్రీకైలాసం విదేశాంగ మంత్రి నిత్యప్రేమాత్మ ఆనంద స్వామి అనే పేరుతో ఈ లేఖ వచ్చిందంట. గతంలో నిత్యానంద చనిపోయినట్లు వచ్చిన వార్తలపై ఆయనే స్వయంగా స్పందించి క్లారిటీ ఇచ్చారు. తాను బ్రతికే ఉన్నానని అప్పట్లో తెలిపారు. ఇప్పుడు తాజాగా ఆయన ఆరోగ్యం విషమించినట్లు, శ్రీలంక సాయం కోరినట్లు వస్తున్న వార్తలు నిజమేనా, లేక ఉత్తితేనా? అని తెలియాల్సి ఉంది.
గతంలో తన మరణంగా క్లారిటీ ఇచ్చినట్లే ..తాజాగా తనపై వస్తున్న వార్తలపై స్పందిస్తారా? లేదా? అనేది చూడాలి. అప్పటి దాకా రోజుకో వార్త హల్ చల్ చేస్తూనే ఉంటాయి. పలు నేరారోపణ కేసుల్లో నిందితుడిగా ఉన్న నిత్యానందస్వామి అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో నిత్యానందపై వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.