మాములుగా పిల్లనిచ్చే అత్తమామలు అల్లుడికి కట్నంగా ప్రాంతాన్ని బట్టి ఏవేవో ఇస్తుంటారు. మరీ ముఖ్యంగా కట్నం అంటే డబ్బులు, నగలు, ఆస్తులు ఇస్తారని తెలుసు. కానీ ఈశాన్య భారతదేశంలో మాత్రం ఏకంగా అల్లుడికి కట్నంగా ఏకంగా ఎలుకలనే ఇస్తారని తెలుసా? వినటానికి ఆశ్చర్యకరంగా ఉన్నా.. ఇది ముమ్మాటికి నిజం. అసలు అల్లుడికి కట్నం కింద ఎలుకలును ఇవ్వడం ఏంటని అనుకుంటున్నారా? అవును దక్షిణ భారతదేశంలో ఇదే సంస్కృతి గత కొంత కాలం నుంచి కొనసాగుతూ వస్తుంది. కట్నం కింద అల్లుడికి ఎలుకల అనే స్టోరీలో అసలేం జరుగుతుందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భారత్ తో పాటు ఇండోనేషియా, థాయ్ లాండ్, చైనా, ఘానా వంటి దేశాల్లో ఎలుకలను ఆహారంగా తీసుకుంటారని మనకు తెలిసిందే. వీళ్లు చికెన్ కంటే ఎలుక మాంసం రుచిగా ఉండడంతో వీళ్లంత ఎలుకల మాంసాన్నే ఎక్కువగా తినేందుకు ఇష్టపడతారట. ఇదిలా ఉంటే ఫిన్లాండ్‌లోని ఓలో యూనివర్సిటీకి చెందిన విక్టర్ బెన్నో మేయర్ ఇటీవల ఎలుకలపై ఓ పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో అతనికి నమ్మలేని నిజాలు, ఆశ్చర్యపోయే సంస్కృతి తెలిసింది. దక్షిణ భారతదేశంలోని ఓ గ్రామంలో గిరిజన ప్రజలు తమ కూతుళ్లకు పెళ్లిళ్లు చేసే క్రమంలో అల్లుడికి ఎలుకలను కట్నం కింద ఇస్తారట. ఇదే ఆచారం వారి గ్రామంలో ఎప్పటి నుంచో కొనసాగుతుందని తెలుస్తోంది. ఇక ఇదే కాదండోయ్.. వీరి గ్రామంలోప్రతీ ఏటా యూనింగ్ ఆరాన్ అనే ఒక ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవంలో భాగంగా ఇంటికి వచ్చిన అతిధును ఎంతో మర్యాదంగా ఆహ్వానిస్తారని తెలుస్తుంది. ఇదే కాకుండా ఇంటికి వచ్చిన అతిధులకు ఎలుకల మాంసాన్ని కూడా వండిపెడతారనే సంచలన నిజాలు బయటపడ్డాయి.