ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు చాలా మంది ప్రేమికులు పార్కులు, సినిమా థియేటర్ లలో కలుసుకున్నారు. అయితే అందరిలానే ఓ ప్రేమ జంట కూడా కలుసుకోవాలనుకున్నారు. కానీ, వీరికి బయట కలుసుకోవడం వీలు కాలేదు. దీంతో ఆ యువకుడు ప్రియురాలు మేడపై కలుసుకున్నారు. వెంటనే ఆ యువతి తల్లి ఎంట్రీ ఇచ్చి ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.
నేటి కాలంలోని కొందరు పిల్లలు తెలిసి తెలియని వయసులోనే ప్రేమా, గీమా అంటూ చెడు తిరుగుళ్లు తిరుగుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పాఠశాల వయసు నుంచే ప్రేమ పేరుతో నచ్చిన యువకులతో తిరుగుతున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా సినిమాలు, షికారులు అంటూ సీక్రెట్ గా కలుసుకుంటున్నారు. అచ్చం ఇలాగే.. ఓ యువతి తన ప్రియుడితో ఏకంగా తన ఇంటి టెర్రస్ పై సీక్రెట్ మీటింగ్ పెట్టింది. తల్లి సడెన్ గా మేడపైకి వెళ్లి కూతరుని, ఆమె ప్రియుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో కాస్త వైరల్ గా మారుతోంది.
ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు చాలా మంది ప్రేమికులు పార్కులు, సినిమా థియేటర్ లలో కలుసుకున్నారు. అయితే అందరిలానే ఓ ప్రేమ జంట కూడా కలుసుకోవాలనుకున్నారు. కానీ, వీరికి బయట కలుసుకోవడం వీలు కాలేదు. దీంతో ఆ ప్రేమికులకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఇక చేసేదేం లేక ఆ యువకుడు.. తన ప్రియురాలిని కలుసుకునేందుకు ఏకంగా ఆమె ఇంటి టెర్రస్ పై కలుసుకోవాలని అనుకున్నాడు. దీనికి అతని ప్రియురాలు కూడా సరే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇక ఇంకేముంది.. ఇద్దరు అనుకున్నట్లే మేడపై కలుసుకోవాలని అనుకున్నారు. ఇక ఇందులో భాగంగానే ఆ ప్రేమికులు ఫిబ్రవరి 14న ప్రియురాలి టెర్రస్ పై సీక్రెట్ గా మీట్ అయ్యారు. చాలా సేపు మాట్లాడుకున్నారు. నవ్వుతు కబుర్లు చెప్పుకున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా హగ్గులు, ముద్దులతో ఇద్దరూ బాగానే ఎంజాయ్ చేశారు. అయితే ఇదే సమయంలో ఏదో పని మీద ఆ యువతి తల్లి సడెన్ గా వారి ఇంటి మేడపైకి వెళ్లింది. కూతురు మరో యువకుడిని కౌగిలించుకుని కపించింది.
ఈ సీన్ చూసిన తల్లి ఒక్కసారిగా షాక్ గురైంది. పట్టలేని కోపంతో ఊగిపోయిన ఆ తల్లి.. కూతురు ప్రియుడిని, కూతురిని పట్టుకుని చెప్పుతో దాడికి దిగింది. అయితే ఎలాగో కూతురి ప్రియుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే దీనిని అక్కడున్న కొందరు స్థానికులు ఇదంతా గమనించి తమ సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. ఇక అదే వీడయోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. కానీ, ఈ ఘటన ఎక్కడ జరిగింది మాత్రం తెలియరాలేదు. ఈ వీడియోను చూసిన చాలా మంది ఒక్కొక్కరు ఒకలా స్పందిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Desi mom catches daughter romancing with boyfriend on terrace, beats them with chappal.pic.twitter.com/AiuTjXTOKJ
— RAGHAV (@Raaghav27) February 16, 2023