అభివృద్ధిలో పోటి పడుతున్న ఈ ప్రపంచంలో ప్రతీ ఒక్కరు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఇక ప్రయాణాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా మారుతుండడంతో సొంతంగా వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు అందరి వద్ద బైక్ లు, కార్లు ఉండడంతో వాయు కాలుష్యంతో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.
ఇలాంటి రోడ్డు ప్రమాదంలో రోజుకి ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా రోడ్డుపై ఓ వృద్దదంపతులు బైక్ పై వెళ్తున్నారు. అలా వారు వెళ్తున్న క్రమంలో సడెన్ గా వారి బైక్ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. అటుగా వెళ్తున్న ఓ యువకుడు వారి సమస్యను గమనించి సమయస్ఫూర్తితో పరుగెడుతున్న వాహనాన్ని పట్టుకుని వారిని ప్రమాదం నుంచి కాపాడాడు.
ఆ యువకుడు కాపాడుతున్న దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. యువకుడి సమయస్ఫూర్తిని చూసి పలువు నెటిజన్స్ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే వీడియో ఇప్పుడు నెట్టింట్లో కాస్త వైరల్ గా మారింది. వృద్దదంపతులను కాపాడిన యువకుడి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.