ఇక్కడే నివాసం ఉంటున్న ఓ యువకుడు ఇటీవల ఓ మొబైల్ షాపులోకి వెళ్లాడు. అదే సమయంలో ఆ షాపులో ఓనర్ లేడు. ఇదే మంచి సమయం అనుకున్న ఆ కేటుగాడు.. ఇటు ఇటు చూసి మెల్లగా రెండు, మూడు సెల్ ఫోన్లు కవర్ లో వేసుకున్నాడు.
ఈ మధ్యకాలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులు నుంచి నగరాల్లో, గ్రాములు అని తేడా లేకుండా చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు. పెళ్లైన మహిళలనే టార్గెట్ చేస్తూ వారి మెడలో ఉన్న బంగారు తాడును పక్కా ప్లాన్ తో దోచుకుని అక్కడ నుంచి పరారవుతున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో చాలానే జరిగాయి. ఇకపోతే తాజాగా ఓ యువకుడు పట్టపగలు ఓ మొబైల్ షాపులో దొంగతనానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ అవుతోంది.
మధ్య ప్రదేశ్ రాష్ట్రం చిత్రకూట్ లోని పాత మార్కెట్ ప్రాంతం. ఇక్కడే నివాసం ఉంటున్న ఓ యువకుడు ఇటీవల ఓ మొబైల్ షాపులోకి వెళ్లాడు. అదే సమయంలో ఆ షాపులో ఓనర్ లేడు. ఇదే మంచి సమయం అనుకున్న ఆ కేటుగాడు.. ఇటు ఇటు చూసి మెల్లగా రెండు, మూడు సెల్ ఫోన్లు కవర్ లో వేసుకున్నాడు. ఇక వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఆ షాపులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే ఆ షాపు ఓనర్ వచ్చి చూడగా.. దొంగతనం జరిగిందని గమనించి నెత్తి నోరు కొట్టుకున్నాడు. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.
— Hardin (@hardintessa143) March 21, 2023