అత్తింటి వారి వేధింపులు భరించలేక ఇటీవల కాలంలో మహిళలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. భర్త వేధించాడనో, అత్త వేధిస్తుందనో మనస్థాపంతో చాలా మంది వివాహితలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొందరు ధైర్యంగా న్యాయ పోరాటం చేసి విజయం సాధిస్తున్నారు. తాజాగా ఓ వివాహిత అలానే చేసింది. ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన అత్తమామలపై నిరసనకు దిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తనను అత్తింటి వారు ఇంట్లో నుంచి వెళ్లకొట్టారని, భర్తను తనతో మాట్లాడనీయడంలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అత్తింటి వారి ముందు నిరసనకు దిగింది. చివరికి పోలీసులు రంగంలోకి దిగి ఆ మహిళను అత్తింట్లోకి పంపించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఏలూరుకు చెందిన గౌరి హైదరాబాద్ లోని అశోక్ నగర్ కు చెందిన శ్రీకృష్ణకు 2019లో వివాహం జరిగింది. కొంత కాలం సజావుగా సాగింది వాళ్ల కాపురం. అయితే గత నాలుగు నెలలుగా భర్తను తనతో మాట్లాడనీయకుండా అడ్డుకుంటూ, తన సామాన్లు అత్తమామలు బయటపడేసి వెళ్లగొట్టారని గౌరి ఆరోపిస్తుంది. తన భర్తను గచ్చిబౌలిలోని వేరే ఇంటికి పంపించి అత్తమాలు తనను వేధిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని గౌరి చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయించింది. సీఐ సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు అశోక్ నగర్ కి పోలీసులు వచ్చారు. అత్తమామలతో మాట్లాడి గౌరిని ఇంట్లోకి పంపించారు. అయితే గైరి కేసు పెట్టడానికి అంగీకరించలేదని లీగల్ గా ప్రొసీడ్ అవుతానని చెప్పిందని సీఐ తెలిపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.